జింక పులుల వేట అంటే అది ఎంతో రసవత్తరంగా ఉంటుంది.జింకను ఎలాగైనా పట్టుకోవాలని పులి ప్రయాణిస్తుండగా, చిరుత పులి నుండి తప్పించుకోవాలని జింక ప్రాణభయంతో పరుగెడుతుంది.
అయితే జింక కొన్ని సార్లు పులికి దొరకక తప్పించుకుంటుంది.అయితే అన్ని సార్లు అది సాధ్యం కాదు.
కొన్ని సార్లు దొరకక తప్పదు.కాని అన్ని రోజులు చిరుతలవి ఉండవు కదా.ఏదో ఒక రోజు తోక ముడవక తప్పదు.అచ్చం ఇలాగే జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జింకను మట్టు బెట్టాలంటే ఒక్క చిరుత పులి చాలు, ఇక మూడు చిరుత పులులు ఉంటే ఇక జింక తప్పిచుకోవడం అసాధ్యం కదా.అవును అందరు ఇలాగే అనుకుంటారు.కాని ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది.మూడు చిరుతలు కలిసి జింకను చుట్టుముట్టాయి.కాని మొదటి సారి జింక చిరుత పులుల బారి నుండి తప్పిచ్చుకుంది.మరల వేటాడి రెండో సారి చుట్టుముట్టాయి.
మరల అదును చూసి జింక తప్పిచ్చుకుంది.ఇక జింకను వేటాడలేక చిరుత పులులు అలసిపోయాయి.
జింక వాటి చెర నుండి తప్పించుకుంది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను నెటిజన్లు ఆద్యంతం ఆసక్తిగా చూస్తున్నారు.నెటిజన్లను ఎంతో ఉత్కంఠకు గురి చేస్తున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.
ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.