కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా చిరుత పులి ఎంట్రీ... సిగ్గు చేటు, ఇది మన ప్రభుత్వాల పని తీరు

నరరూప రాక్షసులకు, మనుషుల రూపంలో ఉన్న మృగాలను కోర్టులో శిక్షిస్తారు.జనారన్యంలో తిరిగే మృగాలను కోర్టుల్లో విచారించి శిక్షిస్తారు.

కోర్టుల్లో న్యాయ విచారణ జరుగుతుంది.అయితే అది మనుషులకు మాత్రమే.

కాని గుజరాత్‌లోని ఒక కోర్టుకు చిరుత పులి వచ్చి నానా హంగామా చేసింది.ఆ చిరుత పులికి ఏం అన్యాయం జరిగిందో కోర్టుకు వచ్చింది.

న్యాయం కోసం వచ్చిన చిరుతపులిని చూసి న్యావాదులు చివరకు జడ్జ్‌తో సహా అంతా భయపడ్డారు.అంతా గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో చిరుతపులి అక్కడ కాస్త హడావుడి చేసి వెళ్లి పోయింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… గుజరాత్‌ లోని సురేంద్రనగర్‌ జిల్లా చోటిల్లా కోర్టులో ఒక కేసు విషయమై సీరియస్‌గా విచారణ జరుగుతుంది.న్యాయవాదులు తమ వాదనను వినిపిస్తున్నారు.కోర్టులో ఉన్న వారు అంతా కూడా సీరియస్‌గా వాదనలు వింటున్నారు.జడ్జ్‌ పాయింట్స్‌ను నోట్‌ చేసుకుంటున్నాడు.అలాంటి సమయం కోర్టు హాల్‌ లోకి ఒక చిరుత పులి ఎంట్రీ ఇచ్చింది.చిరుతను చూసి న్యాయవాదులు మరియు ఖైదీలు అంతా కూడా షాక్‌ అయ్యారు.

ఒక్క సారిగా చిరుత లోనికి రావడంతో తొక్కిసలాట కూడా జరిగింది.

అంతా సీరియస్‌గా ఉండటంతో చిరుత పులి వచ్చిన విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు.లోనికి వచ్చిన తర్వాత దాన్ని చూశారు.దాంతో న్యాయవాదులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

కోర్టు లోపలకు చిరుత వచ్చే వరకు బయట ఉన్న భద్రత అధికారులు, పోలీసులు, కోర్టు సిబ్బంది ఏం చేస్తున్నారో వారికే తెలియాలి.కోర్టులోకి ఉగ్రవాదులు దూసుకు వచ్చినా కూడా ఇలాగే పరిస్థితి ఉంటుందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

కోర్టు హాలులోకి దూసుకు వచ్చిన చిరుతను చూసి అంతా కూడా వివిద మార్గాల ద్వారా బయటకు వెళ్లి పోయారు.అంతా కూడా బయటకు వెళ్లి పోయి కోర్టు హాలు డోర్లు వేశారు.ఆ తర్వాత అటవి అధికారులను పిలిపించి చిరుతను పట్టుకు వెళ్లారు.చిరుత ఏకంగా కోర్టు హాలులోకి రావడం సంచలనంగా మారింది.

అటవి శాఖ అధికారులు మరియు పోలీసు శాఖపై కోర్టు సీరియస్‌ అయ్యింది.ఏ ఒక్కరికి కూడా ఎలాంటి గాయలు కాలేదని, అంతా కూడా సేఫ్‌గా ఉన్నారని కోర్టు అధికారులు చెప్పారు.

మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని జడ్జ్‌గారు అటవి శాఖ వారికి హెచ్చరించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube