కాలేజీ మీద చిరుత‌ దాడి.. స్టూడెంట్‌కు తీవ్ర గాయాలు

Cheetah Attack On College Serious Injuries To Student

ఒక‌ప్పుడు అడ‌విలో మాత్ర‌మే క‌నిపించే చిరుత పులులు ఈ న‌డుమ ఇండ్ల‌లోకి వ‌చ్చేస్తున్నాయి.స‌డెన్ గా ఎంట్రీ ఇచ్చేసి నానా బీభ‌త్సం సృష్టిస్తున్నాయి.

 Cheetah Attack On College Serious Injuries To Student-TeluguStop.com

ఎక్క‌డ ఎవ‌రి మీద ఎలా దాడి చేస్తాయో చెప్ప‌డం ఎవ‌రి త‌రం కావ‌ట్లేదు.ఇక అడ‌వుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే ప్రాంతాల జ‌నం అయితే ప్రాణాల‌ను అరచేతిలో పెట్టుకునే బ‌తుకుతుంటారు.

ఎందుకంటే ఎప్పుడు ఏ క్రూర జంతువు వ‌చ్చి దాడి చేస్తుందో తెలియ‌దు.మ‌రీ ముఖ్యంగా క్రూర మృగాల్లో చిరుత పులి దాడులే ఎక్కువ‌వుతున్నాయి.

 Cheetah Attack On College Serious Injuries To Student-కాలేజీ మీద చిరుత‌ దాడి.. స్టూడెంట్‌కు తీవ్ర గాయాలు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు కూడా ఓ చిరుత ఇలాగే దాడి చేసింది.

ఏకంగా ఓ కాలేజీ మీద దాడి చేసి స్టూడెంట్‌ను తీవ్రంగా గాయపర్చింది.

ఈ ఘ‌ట‌న ఒక్క‌సారిగా అంద‌రినీ క‌ల‌వ‌రానికి గురి చేసింది.ఇక చిరుత దాడితో కాలేజీలో ఉన్న స్టూడెంట్లు, టీచ‌ర్లు ఒక్క‌సారిగా భయంతో పరుగులు పెట్టారు.

ఈ ఆందోళ‌న‌లో తొక్కిస‌లాట జ‌రిగి కొందరు స్టూడెంట్లు గాయపడ్డారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్‌ జిల్లాకు చెందిన ఛర్రా పోలీస్ స్టేషన్ ప‌రిధిలో ఈ విధంగా చిరుత దాడికి దిగిన‌ట్టు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చెక్క‌ర్లు కొడుతోంది.ఈ కాలేజీ అడ‌వికి కొంచెం ద‌గ్గ‌ర‌గా ఉంది.

ఇక క్లాసులు జ‌రుగుతున్న క్ర‌మంలో చిరుత పులి స‌డెన్ గా కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.వ‌స్తూనే ఓ క్లాస్ రూమ్ లో ఉండే స్టూడెంట్ మీద దాడి తీవ్రంగా గాయ‌ప‌రిచింది.ఇక స్టూడెంట్లు, టీచ‌ర్ల అరుపుల‌కు ఆ పులి కాస్తా ఓ క్లాస్ రూమ్ లోకి వెళ్లి దాక్కుంది.ఇక విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది రంగంలోకి దిగి దాదాపు 9గంటలు రిస్క్యూ నిర్వహించి అతిక‌ష్టం మీదచిరుత‌ను ప‌ట్టుకున్నారు.

ఈ చిరుత ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ స్టూడెంట్ ఇప్పుడు ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.అతడి హెల్త్ బాగానే ఉందని డాక్ట‌ర్లు వివ‌రిస్తున్నారు.

#Cheetah Attack #Uttar Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube