ఛీ ఛీ ఛీ .... రైల్వే స్టేషన్ లో దొరికిన ఆ పార్సిల్ లో ఏముందో తెలిస్తే మీరూ అదే అంటారు !

రోడ్ మీద ఏదైనా కుక్క కనిపిస్తే ఏం చేస్తాం .? ఛీ ఛీ అంటూ చీదరించుకుంటూ వెళ్ళిపోతాం.అయితే అటువంటి కుక్క మాంసం గురించి చెప్తే వాంతి వచ్చినంత పనవుతుంది.కానీ తమిళనాడులో జరిగిన ఓ ఆశ్చర్యకర ఘటన గురించి తెలిస్తే ఛీ ఛీ అనాల్సిందే.

 Checking Officers Holding Dog Meat At Egmore Railway Station-TeluguStop.com

అసలు విషయం ఏంటి అంటే…? ఓ పార్శిల్‌ లో దాదాపు 1000 కిలోల కుక్కమాంసం బయటపడింది.ఈ ఘటన ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో వెలుగుచూసింది.

రైల్వే స్టేషన్ లోని ఐదో నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఓ భారీ అనుమానాస్పద పార్శిల్‌ ను ప్రయాణికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.

ఫుడ్‌ సెక్యూరిటీ అధికారులతో రైల్వే స్టేషన్ కు వచ్చిన పోలీసులు ఆ పార్సిల్ ను తెరచి చూశారు.అందులో మాంసం కనిపించేసరికి వారు షాక్ కు గురయ్యారు.దాదాపు 1000 కిలోల కుక్క మాంసంగా భావించిన ఫుడ్‌ సెక్యూరిటీ అధికారులు పరీక్షల నిమిత్తం దానిని ల్యాబ్‌కు తీసుకువెళ్లారు.

ఇదిలావుంటే రాజస్తాన్‌ నుంచి చైన్నై బయల్దేరిన జోధ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో కుక్క మాంసాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్నారని చెన్నై పోలీసులకు ముందుగానే సమాచారం అందినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube