విడుదలకు సిద్దం అంటున్న "చెక్ మేట్"..!  

యాంకర్ విష్ణు ప్రియ ప్రధాన పాత్రలో నటించిన సినిమా చెక్ మెట్.చిన్నికృష్ణ ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమాను ప్రసాద్ బెల్లంపల్లి దర్శకనిర్మాతగా తెరకెక్కించారు.

TeluguStop.com - Check Mate Is Ready For Release

ఈ సినిమాలో బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, రఘు బాబు, శకలక శంకర్, యాంకర్ విష్ణు ప్రియలు కీలక పాత్రలో నటించారు.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఇతరత్రా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ లో చిత్ర బృందం సమావేశం ఏర్పాటు చేసింది.ఇందులో భాగంగా యాంకర్ విష్ణుప్రియ దర్శకనిర్మాత ప్రసాద్ బెల్లంపల్లి మొదలగు వారు పాల్గొన్నారు.

TeluguStop.com - విడుదలకు సిద్దం అంటున్న చెక్ మేట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ కార్యక్రమంలో భాగంగా దర్శక నిర్మాత ప్రసాద్ వెలంపల్లి మాట్లాడుతూ ఎప్పుడైతే సినిమా థియేటర్స్ ఓపెన్ అయితే వెంటనే తమ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించాడు.ఇది వరకే ఈ సినిమాకు సంబంధించి వి.

వి.వినాయక్ ట్రైలర్ ను విడుదల చేశారని దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని ఆయన తెలిపారు.చెక్ మెట్ సినిమా కూడా అన్ని హంగులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైందని ఆయన చెప్పుకొచ్చారు.నలుగురు వ్యక్తులు వాళ్ళకు వచ్చిన సమస్యను ఎలా ధైర్యంగా ఎదుర్కొంటారు అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ఆయన కథ గురించి తెలిపారు.

ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన యాంకర్ విష్ణు ప్రియ మాట్లాడుతూ.చెక్ మేట్ అంటే ఇద్దరు స్టార్స్ మధ్య ఉండే ప్రాబ్లం ఒకరి వలన ఒకరు ఎలా ఇబ్బందులు పడుతున్నారో, అలాంటి సమస్య నుంచి ఎలా బయటపడ్డారో అనే కథతో యాక్షన్ సినిమాను తెరకెక్కించినట్లు ఆవిడ తెలిపింది.

ఇకపోతే ఈ సినిమాలో నటించడానికి తనకు అవకాశం శివరాత్రి రోజు వచ్చిందని ఆ శివుడు తనకు ఈ అవకాశం ఇచ్చాడని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.తనకు ఈ సినిమా ద్వారా ఎంతో మంచి వ్యక్తులు పరిచయం అయ్యారని తనకు ఎన్నో మెమరీస్ ఈ సినిమా ఇచ్చిందని తెలిపింది.

ఈ సినిమాకు సంబంధించి కొరియోగ్రాఫర్ అమ్మరాజశేఖర్ రెండు పాటలను కొరియోగ్రాఫర్ చేశారని అది చూసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అంటూ యాంకర్ విష్ణుప్రియ తెలిపింది.

#Sivarathri #Checkmate #AnchorVishnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Check Mate Is Ready For Release Related Telugu News,Photos/Pics,Images..