టీడీపీలో సీనియర్లకు చెక్.. ఇక వారసులదే రాజ్యం

తెలుగు దేశం పార్టీ 2024 ఎన్నికలే టార్గెట్‌గా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతోంది.ఈ మేరకు చంద్రబాబు పార్టీ నేతలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

 Check For Seniors In Telugu Desam Party Chandrababu , Telugu Desam Party , Desc-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా సీట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబు కఠినంగా వ్యవహరించబోతున్నారు.ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వచ్చే ఎన్నికలు – టిక్కెట్ల అంశం గురించి చంద్రబాబు పార్టీ నేతలతో కీలక అంశాలను ప్రస్తావించారు.

వచ్చే ఎన్నికల్లో పార్టీలో ప్రాధాన్యం లేని సీనియర్లను పక్కన పెట్టనున్నట్లు మొహమాటం లేకుండా చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.సీనియర్లను గౌరవిస్తాం అని చెబుతూనే.ఓట్లు వేయించలేని సీనియర్లు ఉన్నా లాభం లేదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.ఓట్లు వేయించలేని సీనియర్లు తమకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరితే టీడీపీ మళ్లీ ప్రతిపక్షంలోనే ఉండిపోతుందని చంద్రబాబు హెచ్చరించారు.40 శాతం యువతకు సీట్లు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేసినట్లు టాక్ నడుస్తోంది.

సాధారణంగా చంద్రబాబుకు మొహమాటం ఎక్కువ.

ఈ మొహమాటంతోనే గత ఎన్నికల్లో ఆయన సీనియర్లకు పెద్దపీట వేశారు.తీరా ఎన్నికల్లో బొక్కాబోర్లా పడ్డారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యింది.పార్టీ ఓడిపోయిన తర్వాత సీనియర్లు పార్టీని పట్టించుకోవడం మానేశారు.

ఏదో ఉన్నామంటే ఉన్నట్లుగా పార్టీలో కొనసాగుతున్నారు.దీంతో చంద్రబాబు అలాంటి సీనియర్లకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించకూడదని నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Telugu Chandrababu, Palle Raghunath, Seniors, Telugu Desam-Telugu Political News

శుక్రవారం ఓ ప్రెస్‌మీట్‌లో ఇదే విషయాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా ప్రస్తావించారు.వచ్చే ఎన్నికల్లో సీనియర్ నేతలు త్యాగాలు చేయాలని చంద్రబాబు చెప్పినట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు.ఈ మేరకు నిమ్మల కిష్టప్ప, పల్లె రఘునాథ్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, , కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి లాంటి సీనియర్లకు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు చెక్ చెప్పి వాళ్ల వారసులకు టిక్కెట్లు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.అయితే పొత్తులపై పూర్తి క్లారిటీ వచ్చిన తరువాతే చంద్రబాబు టీడీపీలో సీట్ల లెక్కలు తేల్చనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube