చాటింగ్ పేరుతో చీటింగ్..అడ్డంగా బుక్కైన మహిళ, ఎడిటర్     2018-06-01   22:58:32  IST  Raghu V

ఈ మధ్య కాలంలో ఈజీ మనీకోసం జనాలు చేయని మోసాలు లేవు..డబ్బు కోసం ఏకంగా మనుషులనే చంపేస్తున్నారు కూడా అయితే సోషల్ మీడియా వేదికని చేసుకుంటూ కూడా ఎన్నో మొసాలు జరుగుతూనే ఉన్నాయి..అయితే తాజాగా జరిగిన ఒక సంఘటన తో ఒక మహిళా ఒక ఫిలిం ఎడిటర్ అడ్డంగా బుక్కయ్యారు. రాచకొండ డీసీపీ(క్రైం) నాగరాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం..

చింతల్‌కి చెందిన సలిమిడి నవీన్‌రెడ్డి శ్రేయాస్‌ మీడియా సంస్థలో ఫిలిం ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు..అయితే అతడికి వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అదే యేడాదినుంచి మరో మహిళ తో చింతల్‌ శ్రీనివాస్‌నగర్‌లో సహజీవనం చేస్తున్నాడు..ఈ క్రమంలో రెండు కుటుంబాలని నెట్టుకుని రావడం కష్టం కావడంతో సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి సోషల్ మీడియాలో ఛాటింగ్‌ల ద్వారా అమాయకులను బుట్టలో పడేసి డబ్బులు కాజేయాలని పథకం పన్నాడు.