బిగ్ బాస్ ఎలిమినేషన్ లో ఈ చీటింగ్ మీరు గమనించారా.? తేజస్వి గ్రూప్ కోసం దీప్తిని బలిచేశారు.!  

  • బిగ్ బాస్ హౌస్ లో రోజురోజుకి హీట్ పెరుగుతుంది. ఇటీవల ఎపిసోడ్ లో ఊహించని విధంగా యాంకర్ శ్యామల ఎలిమినేట్ అయ్యారు. హగ్‌లు ఇచ్చుకుంటూ, నటిస్తూ పైన పటారం, లోపల లొటారం అన్నట్లు మెలుగుతున్న హౌస్‌ మేట్స్‌కు బిగ్‌బాస్‌ అసలు సిసలు పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో ఇద్దరు మినహా అందరూ త్యాగాలు చేసి ఇతరుల మనసులను గెలుచుకున్నారు. ఈ విషయంలో గత వారం ఎలిమినేషన్‌ అంచు వరకు వెళ్లొచ్చిన దీప్తీనే బిగ్‌బాస్‌ టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. అందరికి కొంత పర్వాలేదనే టాస్క్‌లు ఇచ్చినా ఈమెకు మాత్రం కష్టమైన టాస్క్‌ ఇచ్చాడు.

  • కౌశల్‌ తనకు తాను ప్రతీసారి సెల్ఫ్‌ నామినేట్‌ చేసుకునేలా నందిని రాయ్‌ ఒప్పించాలి. ఇలా ఆమె కౌశల్‌ను ఒప్పిస్తే దీప్తీ నామినేషన్‌ ప్రక్రియ నుంచి తప్పించుకుంటుంది. కానీ అసలే కౌశల్‌ లాజిక్‌గా ఆలోచించెటోడు. బిగ్‌బాస్‌ వ్యూహం ఏమైనప్పటికీ సెల్ఫ్‌ నామినేట్‌ చేసుకుంటే తనకు తాను ఓటమిని అంగీకరించినట్లవుతుందని తను చేయలేనని చెప్పేశాడు.దీంతో దీప్తీ డైరెక్ట్‌గా నామినేట్‌ అయింది. కాబట్టి ఈ సారి ఆమెకు ఎలిమినేషన్‌ త‍ప్పేలా లేదు.

  • Cheating In Telugu Bigg Boss 2 Elimination-

    Cheating In Telugu Bigg Boss 2 Elimination

  • ఇది ఇలా ఉంటె హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి నామినేట్‌ అవుతున్న కామన్‌ మ్యాన్‌ గణేశ్‌ ఈ టాస్క్‌ విషయంలో అత్యుత్సాహం కనబర్చాడు. ఈసారీ నామినేషన్‌ నుంచి గణేశ్‌ను తప్పుకోవాలంటే బాబు గోగినేని తనకు అంతగా ఇష్టం లేని రెండు కొత్తిమీర కట్టలు తినాలనే ప్రతిపాదనను పెట్టాడు బిగ్‌బాస్‌. పాపం బాబు గోగినేని గణేశ్‌ కోసం ఆ రెండు కట్టలు తినేసి ఎలిమినేషన్‌ నుంచి రక్షించాడు.

  • అయితే రోల్‌రైడాను రక్షించడం కోసం గణేశ్ తనకు తాను సెల్ఫ్‌ నామినేట్‌ చేసుకోని అత్యుత్సాహం ప్రదర్శించాడు. దీంతో పాటు అతను ఈ వారం మొత్తం పండ్లు మాత్రమే తినాలి. కానీ గణేశ్‌ చర్య అతని అవగాహనరాహిత్యాన్ని తెలియజేసింది. అది బిగ్‌బాస్‌ హౌస్‌ అందులో ఎవరిని నమ్మవద్దనే విషయాన్ని గణేశ్‌ ఇన్నిరోజులైనా గ్రహించలేకపోయాడు. ఇదే రోల్‌రైడా గణేశ్‌ ఈ హౌస్‌కు పనికి రాడంటూ ఎన్నోసార్లు నామినేట్‌ చేశాడు. నిజానికి రోల్‌రైడా నామినేట్‌ అయినా అతనికి వచ్చే నష్టం ఏమిలేదు. అతను హౌస్‌లో యాక్టివ్‌గానే ఉంటున్నాడు. కామన్‌ మ్యాన్‌ గణేశ్‌ విషయంలో ‍ప్రేక్షకుల నిర్ణయంపైనే దీప్తీ ఎలిమినేషన్‌ ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.

  • Cheating In Telugu Bigg Boss 2 Elimination-
  • ఇక అమిత్ విషయానికి వస్తే.నాలుగువారాలైనా ఏ గొడవ లేకుండా అందరివాడు అనిపించుకుంటున్న అమిత్‌ ఈసారి అడ్డంగా బుక్కయ్యాడు. హౌస్‌లో అమిత్‌ భానుశ్రీతో కొంచెం క్లోజ్‌గా ఉండటంతో వీరి మధ్య బిగ్‌బాస్‌ చిచ్చు పెట్టేశాడు. భానుశ్రీ ఎలిమినేషన్‌ తప్పించుకోవాలంటే అమిత్‌ తన తలపాగాను సీజన్‌ మొత్తం తీసేయాలి, ఇంకోటి ఎప్పుడూ కెప్టెన్సీకి పోటీ చేయకూడదు. దీనికి ముందు భాను వద్దన్నా అంగీకరిస్తూ బయటకు వచ్చిన అమిత్‌ను తేజస్వీ, సామ్రాట్‌లు ఒకసారి ఆలోచించుకో అని చెప్పడంతో వెనకడుగు వేశాడు. ఇక భానుశ్రీకి తెలంగాణ సెంటిమెంట్‌ కలిసొస్తుండటంతో ఆమె ఇప్పుడే ఎలిమినేట్‌ అయ్యే అవకాశం లేదు.