కేబుల్ వ్యాపారం అడ్డుపెట్టుకొని కోడెల కుమారుడి భారీ మోసం...ఎప్పుడైనా అరెస్ట్ కు రంగం సిద్ధం

అధికారంలో ఉన్నప్పటికీ,అధికారం లేనప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలలో కనిపిస్తుంది.ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకోవడమే కాకుండా అధికారంలో ఉన్నప్పుడు పదవిని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డ వారు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.మొన్నటివరకు పెద్దగా వార్తల్లో కనిపించని కోడెల కుమారుడు కోడెల శివ రామకృష్ణ అరెస్టుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తుంది.2014 ఎన్నికల్లో టీడీపీ పార్టీ విజయం సాధించిన తరువాత కోడెల శివప్రసాద్ రావు స్పీకర్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే.

 Cheating Case Registered Against On Kodela Sivaprasad Son-TeluguStop.com

-Telugu Political News

అయితే ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోడెల శివ రామకృష్ణ ప్రజలను తీవ్ర స్థాయిలో పీడిస్తున్నారని, జగన్ విపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో ఇదే అంశం పై పలువురు ఏకరువు కూడా పెట్టినట్లు తెలుస్తుంది.గుంటూరు జిల్లా లో కేబుల్ వ్యాపారం నిర్వహించిన శివ రామకృష్ణ పలువురు వ్యాపారులను మోసం చేసి దాదాపు రూ.70 కోట్లకు పైగా వెనకేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే పలు కంపెనీలు ఆయన పై ఫిర్యాదు చేయడం తో కోర్టు ఆదేశాల అనుసారం రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు గత (ఆదివారం) రాత్రి నుండి కోడెల శివరాం కి సంబంధించి హైదరాబాద్‌, గుంటూరు లోని పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.

-Telugu Political News

పైరసీ ద్వారా కేబుల్‌ కనెక్షన్‌ వ్యాపారం చేసి సుమారు రూ.70 కోట్లు కేబుల్‌ కంపెనీలకు ఎగ్గొట్టినట్లు పలు కంపెనీ లు కోర్టు కి ఆధారాలు సమర్పించాయి.ఈ కేసు విచారణను చేపట్టిన కోర్టు.భారత దేశ చరిత్ర లో ఇంత భారీ స్థాయి లో అక్రమాలకి పాల్పడిన మొదటి కేబుల్‌ పైరసీ కేసు గా వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది.

ఇదే.అని వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.దీనితో కోర్టు ఆదేశాల మేరకు.రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసుల తో పాటు ఈడీ అధికారులు కూడా అణువణువునా గాలిస్తున్నాయి.ఈ క్రమంలోనే శివరామకృష్ణ ను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube