బిగ్ బాస్ కత్తి కార్తీకపై కేసు నమోదు.. కారణమేమిటంటే..?  

cheating case on dubbaka by poll candidate anchor kathi karthika, anchor kathi karthika, dubbaka by poll candidate ,Bigg boss kathi karthika, banjara hills, land issue - Telugu Banjara Hills, Land Issue

టీవీ యాంకర్ గా, బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కత్తి కార్తీక త్వరలో జరగనున్న దుబ్బాక ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే.ఆమెపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

TeluguStop.com - Cheating Case On Dubbaka By Poll Candidate Anchor Kathi Karthika

భూ వివాదంలో సెటిల్‌మెంట్ చేస్తానని చెప్పి కత్తి కార్తీక తనను మోసం చేసిందని ఒక వ్యక్తి ఆమెపై ఫిర్యాదు చేశాడు.ఎన్నికల బరిలో నిలిచిన కత్తి కార్తీకపై బాధితుడు అనేక ఆరోపణలు చేశాడు.

అమీన్ పూర్ దగ్గర ఉన్న 52 ఎకరాల స్థలాన్ని 35 కోట్ల రూపాయలకు ఇప్పిస్తానని చెప్పి కోటి రూపాయలు కత్తి కార్తీక అడ్వాన్స్ గా తీసుకుందని బాధితుడు తెలిపాడు.పోలీసులు ఈ కేసులో కత్తి కార్తీకతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

TeluguStop.com - బిగ్ బాస్ కత్తి కార్తీకపై కేసు నమోదు.. కారణమేమిటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

లండన్ లో అర్కిటెక్చర్ విద్యను అభ్యసించిన కత్తి కార్తీక తెలంగాణ సర్కార్ నుంచి పలు ప్రాజెక్టులను సైతం దక్కించుకుంది.స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న కత్తి కార్తీకకు ఈ కేసు ప్రజల్లో వ్యతిరేకత పెంచే అవకాశం ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టచ్ స్టోన్ ప్రాపర్టీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న అనే వ్యక్తికి వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీధర్ తో రెండు దశాబ్దాలుగా పరిచయం ఉంది.దొరస్వామి తన సంస్థను మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో భూముల కోసం వెతుకుతున్నానని శ్రీధర్ కు తెలిపాదు.

అనంతరం శ్రీధర్ దొరస్వామిని కార్తీక్ గ్రూప్ ను నిర్వహిస్తున్న కత్తి కార్తీకకు పరిచయం చేశాడు.

కత్తి కార్తీక మెదక్ జిల్లాలోని అమీన్ పూర్ గ్రామంలో 52 ఎకరాల స్థలం ఉందని అందులో కొంత స్థలం తమది కాగా మిగిలిన స్థలానికి సంబంధించిన పత్రాలు, జీపీఏ హక్కులు తమ దగ్గరే ఉన్నాయని కత్తి కార్తీక దొరస్వామికి చెప్పారు.

అయితే అనంతరం ఆ స్థలం మరో వ్యక్తిదని, ఆ వ్యక్తి ఎవరికీ జీపీఏ హక్కులు ఇవ్వలేదని తెలిసి దొరస్వామి పోలీసులను ఆశ్రయించి కత్తి కార్తీకతో పాటు మరి కొందరిపై ఫిర్యాదు చేశాడు.

#Land Issue #Banjara Hills

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Cheating Case On Dubbaka By Poll Candidate Anchor Kathi Karthika Related Telugu News,Photos/Pics,Images..