బాలీవుడ్ హీరోయిన్ పై చీటింగ్ కేసు నమోదు  

Cheating Case Lodged Against Shilpa Shetty And Raj Kundra - Telugu , Mumbai Heroin Shilpa Shetty, Mumbai Police Cheatin Case File, Sachin Joshi Nri, Shilpa Shetty

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి ఆమె భర్తపై ఛీటింగ్ కేసు నమోదైనట్లు తెలుస్తుంది.ముంబాయి పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసారు.వీరిద్దరికి సంబంధించిన సత్యయుగ్ గోల్డ్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీ తనను మోసం చేసిందంటూ సచిన్ జోషి అనే ఎన్‌ఆర్ఐ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.2014లో రాజ్‌ కుంద్రా, శిల్పా శెట్టిలకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఐదేళ్లకు సంబంధించిన ఓ గోల్డ్ స్కీమ్ ప్రకటించిందని,అందులో భాగంగా రూ.58 లక్షలకు తాను కిలో బంగారం కొనుగోలు చేశానని సదరు వ్యక్తి పోలీసులకు వివరించారు.దీనికి ఆధారంగా తనకు ఒక గోల్డ్ కార్ట్ కూడా ఇచ్చారని అతడు పేర్కొన్నాడు.సదరు జోషి టర్మ్ ప్లాన్ 2019 మార్చి 25న ముగిసినప్పటికీ వారు చెప్పినట్లు బంగారం ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదని తన ఫిర్యాదు లో పేర్కొన్నాడు.

Cheating Case Lodged Against Shilpa Shetty And Raj Kundra

దీంతో గోల్డ్ స్కీమ్ ప్రకారం తాను ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు బంగారం తీసుకోవడానికి వీళ్ల కార్యాలయానికి వెళ్తే అప్పటికే కంపెనీ మూసి వేసారు.దీనితో శిల్పా శెట్టి,రాజ్ కుంద్రాలను సంప్రదించగా మేమిద్దరం మే 2016 మరియు నవంబర్ 2017 లో రాజీనామా చేసినట్లు చెప్పడం తో ఈ స్కీమ్ లో మోసపోయిన విషయం అర్ధం అయ్యింది అని సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.

బాలీవుడ్ హీరోయిన్ పై చీటింగ్ కేసు నమోదు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Cheating Case Lodged Against Shilpa Shetty And Raj Kundra Related Telugu News,Photos/Pics,Images..

footer-test