కరోనిల్ ఎఫెక్ట్ బాబా రాందేవ్ పై చీటింగ్ కేసు!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి యోగా గురు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థ “కరోనిల్” అనే ఔషధాన్ని తయారుచేసాము అని చెబుతూ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.మంగళవారం ప్రకటించారో లేదో అప్పుడే ఆ సంస్థ పై బాబా రాందేవ్ పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది.కోవిడ్-19 కి కరోనిల్ మందుతో ఆయుర్వేద చికిత్స చేయొచ్చు అంటూ పతంజలి సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే కరోనా మందు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో సెక్షన్‌ 420(చీటింగ్‌) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

 Baba Ram Dev, Corona Medicine, Cheating Case On Baba Ram Dev,pathanjali,coronil-TeluguStop.com

రాందేవ్‌ బాబా, ఆచార్య బాలకృష్ణ సహా ఐదుగురిపై రాజస్థాన్‌లో ఈ కేసు నమోదైంది.

కరోనాను కరోనిల్‌ మందు నివారిస్తుందని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు చేయడంతో జైపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

రాందేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణ, శాస్త్రవేత్త అనురాగ్, నిమ్స్ చైర్మన్ బల్బీర్ సింగ్ తోమర్, నిమ్స్ డైరెక్టర్ అనురాగ్ తోమర్‌పై జ్యోతీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.ఆ ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసినట్లు తెలుస్తుంది.

మరోపక్క ఔషధాలను నిశితంగా పరిశీలించేవరకూ వాటి గురించి ప్రకటనలు, ప్రచారం నిలిపివేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థను ఆదేశించిన విషయం తెలిసిందే.మరోవైపు క‌రోనాకు ఔషధం పేరుతో ప‌తంజ‌లి ప్ర‌క‌టించిన క‌రోనిల్‌పై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించిన ప్రైవేటు ఆస్ప‌త్రికి రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం నోటీసులు కూడా జారీ చేసింది.

ఇప్పటికే పలు సమస్యలు ఎదురుకొంటున్న పతంజలి పై ఇప్పుడు మరో ఎఫ్ ఐ ఆర్ నమోదు అవ్వడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube