చైసామ్ విడిపోవడానికి ప్రీతమ్ కారణమా.. అక్కా అని పిలిచినప్పటికీ?

సమంత చైతన్య విడిపోవడానికి ఖచ్చితమైన కారణాలు తెలియకపోయినా నెటిజన్లు మాత్రం వీళ్లు విడిపోవడానికి వేర్వేరు కారణాలను ప్రచారంలోకి తెస్తున్నారు.అక్టోబర్ 7వ తేదీన సమంతచైతన్యల బంధం గురించి క్లారిటీ వస్తుందని అభిమానులు భావించినా ఐదు రోజుల ముందే సోషల్ మీడియా ద్వారా విడిపోతున్నట్టు షాకింగ్ ప్రకటన చేసి సమంత చైతన్య ప్రేక్షకులకు షాకిచ్చారు.

 Chaysam Divorce Netizens Trolls Samantha Stylist Preetham Jukalrkar Details, Com-TeluguStop.com

వైవాహిక బంధంను ఇకపై కొనసాగించలేమని చైతన్య సమంత చెప్పుకొచ్చారు.అయితే ఈ జంట విడిపోవడానికి సమంత పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ కారణమనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.ప్రీతమ్ జువల్కర్ పై కాళ్లు పెట్టి సమంత దిగిన ఫోటో గతంలో నెట్టింట తెగ వైరల్ అయింది.అప్పటికే సమంతకు పెళ్లి కావడంతో అక్కినేని అభిమానులకు సైతం ఆ ఫోటో అస్సలు నచ్చలేదు.

సమంత వ్యవహార శైలి గురించి సైతం తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయి.

నెటిజన్లు సైతం ప్రీతమ్ జువాల్కర్ వల్లే సమంత చైతన్య విడిపోయారని కామెంట్లు పెడుతున్నారు.

Telugu Tollywood-Movie

సమంత విడాకులకు సంబంధించిన ప్రకటన చేసిన తర్వాత ప్రీతమ్ పెట్టిన పోస్టులు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.కొంతమంది నెటిజన్లు ప్రీతమ్ ఇన్ స్టాగ్రామ్ లో సైతం పోస్టులు పెట్టి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.కొందరు నెటిజన్లకు ప్రీతమ్ ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు.

Telugu Tollywood-Movie

అయితే నిజ జీవితంలో ప్రీతమ్ సమంతను అక్కా అని పిలుస్తాడు.నెటిజన్ల ట్రోలింగ్ ను తట్టుకోలేక ప్రీతమ్ కామెంట్ సెక్షన్ ను డిసేబుల్ చేయడం గమనార్హం.అయితే సమంత చైతన్య అధికారికంగా క్లారిటీ ఇవ్వని పక్షంలో మరెన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

సమంత చైతన్య సోషల్ మీడియా, వెబ్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube