ఆ రాష్ట్రంలో గుట్టలు గుట్టలుగా శవాలు.. ఇది కరోనా మరణమృదంగం.. !

దేశ ప్రజలు కరోనాపై విజయం సాధిస్తున్నామన్న సమయం వచ్చిందని భావించిన వేళ, మళ్లీ తిరగబెట్టిన కరోనా రెండో వేవ్ ఊహించని విధంగా రెచ్చిపోతుంది.ఈసారి మాత్రం కొత్తగా అంటే ఎటువంటి లక్షణాలూ లేకుండానే మనుషుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది.

 Chattisgarh Hospitals Are Full Of Corona Dead Bodies , Chattisgarh, Raipur Hospi-TeluguStop.com

కాగా హోమ్ ఐసొలేషన్ వంటి సదుపాయాలు పెరిగిన, వ్యాక్సిన్ వచ్చినా దీని ఉదృతి మాత్రం ఆగడం లేదు.

ఇకపోతే కరోనా అత్యధిక కేసుల్లో కోవిడ్ లక్షణాలున్న వారు గుండెపోటుతో మరణిస్తున్నారని, ఒక్క రాయ్ పూర్ లో సరాసరిన రోజుకు దాదాపుగా 55 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తుండటం గమనార్హం.

మొత్తానికి పెరుగుతున్న కరోనా కేసులు ఛత్తీస్ గఢ్ లో మరణమృదంగాన్నే సృష్టిస్తున్నాయి.

రాయ్ పూర్ లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి సహా, పలు పట్టణాల్లోని హాస్పిటల్స్ లో శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుంటున్నాయి.

పలు మృతదేహాలను దాచే పరిస్థితులు లేక ఎండలో వాటిని ఉంచడాన్ని చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది.ఇదిలా ఉండగా కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబీకులు మృతదేహాలను తీసుకుని వెళ్లడం లేదని వైద్య సిబ్బంది వాపోయారు.

మరి ప్రస్తుత పరిస్దితి తీవ్రతరంగా మారుతున్నట్లుగా కనిపిస్తుంది.కాబట్టి ప్రజలంతా ఇకనైనా బాధ్యతగా ప్రవర్తిస్తే కొంత వరకైనా కరోనా కట్టడి చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube