రోడ్డు మధ్యలో ఓ యువతి ఫోన్ లో చాటింగ్..తరువాత ఏం జరిగిందంటే..

స్మార్ట్ మొబైల్స్‌తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.ఇక అన్ని సమస్యలే .

 Chatting On The Phone With A Young Woman In The Middle Of The Road What Happened-TeluguStop.com

వాటిని ఓ క్షణం చూసి వదిలేసే పరిస్థితి ఉండదు.అన్‌లాక్ చెయ్యగానే చాలా మెసేజ్‌లు ఇదే విధంగా రోడ్డుపై మొబైల్ చూసుకోవడం కూడా సమస్యే అని ఓ వీడియో హెచ్చరిస్తోంది.

మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ పోలీసులు తరచూ చెబుతూనే ఉంటారు.ఎందుకంటే.

అలా చేస్తే మన బ్రెయిన్ ఒకేసారి రెండు పనులు చెయ్యాల్సి ఉంటుంది.ఒకటి రోడ్డుపై బండిని జాగ్రత్తగా నడపడం, రెండోది మొబైల్‌లో అవతలి వాళ్లు చెప్పే వాటిని చెవి ద్వారా విని మనకు తెలిసేలా చెయ్యడం.

ఒకే సమయంలో రెండు విరుద్ధమైన పనులను చెయ్యడం బ్రెయిన్‌కి సమస్యే.రెండింటినీ బ్యాలెన్స్ చేసే విషయంలో తేడా వస్తే… బ్రెయిన్ నుంచి సరైన సందేశాలు బయటకు రావు.

దాంతో రోడ్డు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ వీడియోని గమనిస్తే ఓ యువతి… రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి.

మొబైల్ చూసుకుంటోంది.ఇంతలో ఓ కారు స్కూటీ వెనక్కి వచ్చి ఆగింది.

కారు నడిపే వ్యక్తి ఆమెను పక్కకు వెళ్లమని చెప్పినా ఆమె వెళ్లలేదు.అతను కారు దిగి ఆమె దగ్గరకు వెళ్లి.

సైడ్‌కి వెళ్లమని చెప్పినా వినలేదు.మొబైల్ చూసుకుంటూనే ఉంది.

దాంతో చిర్రెత్తుకొచ్చిన ఆతను మొబైల్ లాగేసుకొని.బండిని ఆమెతో సహా ఎత్తి పక్కకు లాక్కుంటూ తీసుకుపోయాడు.

ఇది గమనించిన ఓ పోలీస్.పరుగున వచ్చి.

ఇద్దర్నీ ఓదార్చి.కారును డ్రైవ్ చెయ్యమని చెప్పడంతో వీడియో ముగిసింది.

రోడ్లపై ట్రాఫిక్ జామ్ వల్ల వాహనదారుల్లో సహనం తక్కువగా ఉంటుంది.పైగా పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో.

ట్రాఫిక్‌లో ఎక్కువ సేపు నడిపితే..

పెట్రోల్ తెగ అయిపోతుందనే ఆందోళనలో ఉంటున్నారు ప్రజలు.అందువల్ల ఇక్కడ కచ్చితంగా తప్పు ఆమెదే అవుతుంది.

అతను కారు దిగి వచ్చి చెప్పినప్పుడైనా ఆమె సైడ్‌కి వెళ్లాలి.అలా చెయ్యకపోవడం వల్ల అతనిలో సహనం పూర్తిగా పోయింది.ఫలితంగా రచ్చ రచ్చ అయ్యింది.దగ్గర్లోనే పోలీస్ ఉన్నారు కాబట్టి.అతను ఆమెపై దాడి చెయ్యకుండా.పోలీసుకి విషయం చెప్పి ఉంటే బాగుండేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube