ఈమద్య కాలంంలో టాలీవుడ్‌కు చెందిన సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవ్వడం చాలా కామన్ అయ్యింది.కాని టాలీవుడ్ హీరో టాలీవుడ్ డైరెక్టర్ టాలీవుడ్ మూవీని అక్కడ రీమేక్ చేయడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది.
మన సినిమా అక్కడ జెండా పాతేందుకు వెళ్లడం అంటే గర్వంగా ఉంటుంది.బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు వివి వినాయక్ లు కలిసి చత్రపతి సినిమాను రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యారు.
ఇన్ని రోజులు ఈ వార్తలను చాలా మంది కొట్టి పారేస్తూ వచ్చారు.అంత సీన్ లేదులే అనుకుంటూ దాటవేస్తూ వచ్చిన వారికి షాక్ ఇస్తూ నేడు అధికారికంగా ప్రకటన వచ్చింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రీమేక్ అంటే కాస్త పర్వాలేదు కాని వివి వినాయక్ దర్శకత్వంలో రీమేక్ అంటే చాలా మంది షాకింగ్ గా ఫీల్ అవుతున్నారు.
ఉన్నది ఉన్నట్లుగా తీయడంలో వినాయక్ దిట్ట అనడంలో సందేహం లేదు.కాని రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చత్రపతిని ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా తీస్తే టైం తేడా కొడుతుంది.అప్పుడు ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి.
ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగా ఖచ్చితంగా కథ మరియు స్క్రిప్ట్ లో మార్పు రావాల్సిందే.ఆ మార్పులతో వినాయక్ చత్రపతిని హిందీలో ఎలా తీస్తాడు అనేది ప్రస్తుతం అందరి ముందు ఉన్న ప్రశ్న.
అన్ని వర్గాల వారిక ఈ సినిమా ఖచ్చితంగా కరెక్ట్ అవుతుందని ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు.అయితే బెల్లంకొండ తీసుకున్న రెండవ నిర్ణయం పట్ల మాత్రం కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రీమేక్ చేయాలనే నిర్ణయం మంచిదని కాని వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేసే విషయం కాస్త తేడా కొడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ విషయంలో బెల్లంకొండ ఏం చెప్పబోతున్నాడు అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వినాయక్ ఖచ్చితంగా తనదైన శైలిలో ఈ యాక్షన్ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు అద్బుతంగా దించుతాడు అంటున్నారు ఆయన అభిమానులు.