ఛత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో మీకు తెలుసా..?

ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా ప్రభాస్ కు మాస్ హీరోగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచిన సంగతి తెలిసిందే.శ్రియ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా శ్రియ పాత్ర నటిగా ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది.

 Chatrapati Fame Bhaswanath Vamsi Photo Goes Viral In Social Media-TeluguStop.com

ఈ సినిమాలో సూరీడు అనే పాత్రను ప్రేక్షకులు తేలికగా మరిచిపోలేరు.సూరీడు పాత్ర కనిపించేది కొంత సమయమే అయినా ప్రేక్షకులను ఆ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే ఛత్రపతి సినిమాలో సూరీడు పాత్ర పోషించిన భస్వంత్ వంశీ ఎక్కువ సినిమాల్లో నటించలేదు.విదేశాల్లో చదువును పూర్తి చేసిన భస్వంత్ వంశీ హీరో కావాలని ప్రయత్నాలు చేస్తుండగా భస్వంత్ వంశీ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

 Chatrapati Fame Bhaswanath Vamsi Photo Goes Viral In Social Media-ఛత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనితా చౌదరి ఆ సినిమాలో సూరీడుకు అమ్మ పాత్రలో నటించారు.తాజాగా అనితా చౌదరి, భస్వంత్ వంశీ కలిసి ఫోటో దిగగా ఆ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Telugu Anitha Chowdhary, Bhaswanth Vamsi, Bhaswanth Vamsi Latest Photo, Chatrpati Sooreedu, Photo Goes Viral, Prabhas, Rajamouli, Social Media, Super Hit Movie-Movie

సూరీడు పాత్ర సినిమాలో ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేయడంలో ఎంతగానో సహాయపడింది.తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వంశీ హీరోగా కూడా సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది.లుక్స్ పరంగా వంశీ బాగానే ఉండటంతో ఇండస్ట్రీలో వంశీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఛత్రపతి అడిషన్స్ కొరకు వెళ్లి తొలి రౌండ్ లోనే జక్కన్నను తన యాక్టింగ్ స్కిల్స్ తో ఫిదా అయ్యేలా చేసి వంశీ ఛత్రపతి సినిమాలో ఛాన్స్ కొట్టేశారు.

Telugu Anitha Chowdhary, Bhaswanth Vamsi, Bhaswanth Vamsi Latest Photo, Chatrpati Sooreedu, Photo Goes Viral, Prabhas, Rajamouli, Social Media, Super Hit Movie-Movie

ఈ సినిమా నిర్మాతలకు సైతం భారీ మొత్తంలో లాభాలను అందించడం గమనార్హం.ఎక్కువ సెంటర్లలో 100 డేస్ ఆడిన సినిమాగా కూడా ఈ సినిమాకు పేరుంది.ఈ సినిమా రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా కావడం గమనార్హం.

#Rajamouli #BhaswanthVamsi #Bhaswanth Vamsi #Prabhas #Super Hit Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు