ఇప్పటికీ కష్టాలు తీరలేదు.. అందుకే భార్యను అక్కడ చేర్పించిన ఛత్రపతి చంద్రశేఖర్..

చంద్రశేఖర్.ఈ పేరు వింటే పెద్దగా గుర్తుపట్టరు.కానీ.ఛత్రపతి చంద్రశేఖర్.అంటే చాలా మందికి ఠక్కున గుర్తొస్తాడు.నటనపై మక్కువతో తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఎంతో మంది నటుల్లో ఆయన ఒకడు.

 Chatrapathi Chandra Sekhar About His Problems Details, Chatrapathi Chandra Sekha-TeluguStop.com

సినిమా అవకాశాల కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు.పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సినిమా పరిశ్రమలో తనకు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఆయనకు ఇప్పటికీ ఆర్థిక కష్టాలు మాత్రం తీరడం లేదు.చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

అనంతరం హైదరాబాద్ కు వచ్చి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేశాడు.ఆ తర్వాత నటనలో మెలుకువలు తెలుసుకునేందుకు దేవదాస్ కనకాల యాక్టింగ్ స్కూల్లో చేరాడు.

కొంతకాలం పాటు అక్కడ నటనలో శిక్షణ తీసుకున్నాడు.

అనంతరం రాజీవ్ కనకాలతో కలిసి పలు యాడ్స్ లో నటించాడు.

అదే సమయంలో దర్శకుడు రాజమౌళి కూడా ఇదే యాక్టింగ్ స్కూల్ కి వచ్చాడు.అక్కడే చంద్రశేఖర్ పరిచయం అయ్యాడు.

తన నటన కూడా రాజమౌళికి బాగా నచ్చింది.దీంతో రాజమౌళి తొలిసారి దర్శకత్వం వహించిన శాంతినివాసం సీరియల్ లో చంద్రశేఖర్ కు అవకాశం ఇచ్చాడు.

తొలుత తనలో నటనా సామర్ధ్యాన్ని గుర్తించి అవకాశం ఇచ్చిన రాజమౌళిని తన గాడ్ ఫాదర్ గా చెప్పుకుంటాడు చంద్రశేఖర్.

Telugu Artistchandra, Chatrapathi, Rajamouli, Rajeev Kanakala, Tollywood-Movie

రాజమౌళి దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో చంద్రశేఖర్ కు అవకాశం దొరికింది.బాహుబలి, యమదొంగ సినిమాల్లో మాత్రమే ఆయనకు అవకాశం దొరకలేదు.చాలా సినిమాల్లో నెగెటివ్ పాత్రలు వేసిన చంద్రశేఖర్ కు ఛత్రపతి సినిమా మంచి గుర్తింపు తెచ్చింది.

అప్పటి నుంచి తను ఛత్రపతి చంద్రశేఖర్ గా మారిపోయాడు.

Telugu Artistchandra, Chatrapathi, Rajamouli, Rajeev Kanakala, Tollywood-Movie

ఎన్నో ఇబ్బందులు పడి సినిమా పరిశ్రమలోకి వచ్చినా.పలు సినిమాల్లో మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు.అయినా తనకున్న ఆర్థిక ఇబ్బందులు మాత్రం తీరలేదు.

అందుకే తన భార్యను మోడలింగ్ కోర్సులో చేర్పించాడు.ప్రస్తుతం ఆయన టీవీరంగంలో కొనసాగుతున్నాడు.

పలు సీరియల్స్ లో యాక్టర్ గా చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube