ఛాట్‌జీపీటీ… గురించి ఇక్కడ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.గత కొన్నాళ్లుగా టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ఇది.
అయితే ఛాట్‌జీపీటీ( chatgpt ) విపరీతంగా నీళ్లు తాగేస్తోందని చెబుతున్నారు నిపుణులు.ఆశ్చర్యంగా వుంది కదూ.ఛాట్‌జీపీటీలో ఎలాంటి ప్రశ్నకైనా వివరణాత్మకంగా సమాధానం లభిస్తుందనే విషయం తెలిసిందే.అయితే ఇలా అది సమాధానాలు చెప్పడానికి విపరీతంగా నీళ్లు తాగేస్తుంది.
సమాధానాలు ఇవ్వడం కోసం ఛాట్‌జీపీటీకి ఆల్గరిథమ్స్‌తో ట్రైనింగ్ ఇస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇలా శిక్షణ ఇచ్చే క్రమంలో చాలావరకు శక్తి ఖర్చవుతుందని సమాచారం.ఈ శిక్షణ ప్రక్రియలో పెద్దమొత్తంలో నీళ్లు ఖర్చవుతున్నట్టు తాజాగా తేలింది.యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో రివర్‌సైడ్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆర్లింగ్‌టన్ “మేకింగ్ ఏఐ లెస్ థర్‌స్టీ”( Making AI Less Thirsty ) పేరుతో పరిశోధన జరపగా ఈ పరిశోధనలో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.ఛాట్‌జీపీటీ-3 కి అమెరికాలోని డేటా సెంటర్లలో శిక్షణ ఇచ్చే క్రమంలో 185,000 గ్యాలన్ల నీళ్లు ఖర్చవుతున్నాయని మైక్రోసాఫ్ట్ అంచనా వేసినట్టు తెలుస్తోంది.ఒక గ్యాలన్ అంటే 3 లీటర్ల పైనే కదా.
అంటే ఈ లెక్కన 7 లక్షల లీటర్ల నీళ్లు ఖర్చు అవుతున్నాయన్నమాట.ఈ నీటితో న్యూక్లియర్ రియాక్టర్ కూలింగ్ టవర్‌ను నింపేయొచ్చు.ఛాట్‌జీపీటీ సుమారు 20 నుంచి 50 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి అరలీటర్ నీళ్లు ఖర్చు చేస్తుందని పరిశోధకులు తేల్చారు.ఒకవేళ కొత్తగా లాంఛ్ చేసిన జీపీటీ-4 ఏఐ సిస్టమ్‌కు ఇంతకన్నా ఎక్కువ రెట్లు నీళ్లు ఖర్చవుతాయని పరిశోధకులు అంచనా వేయడం గమనార్హం.
అయితే ఇక్కడ ఛాట్‌జీపీటీ నీళ్లు ఖర్చు చేయడం ఏంటీ అని సందేహం కలగొచ్చు.సర్వర్ రూమ్‌లను ఎప్పుడూ చల్లగా ఉంచాలి.10 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్యే సర్వర్ రూమ్‌లు ఉండాలి.అందుకే ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసేందుకు కూలింగ్ టవర్స్ ఏర్పాటు చేస్తారు.