మందు గ్లాసుతో పూరికి విషెష్ చెప్పిన ఛార్మి.. మాములుగా లేదుగా!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో మాస్ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించి అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు పూరీజగన్నాథ్ నేడు (సెప్టెంబర్ 28)పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు, సినీ సెలబ్రిటీలు అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 Charmy Kaur Birthday Wishes To Director Puri Jagannath With A Wine Glass, Charmy-TeluguStop.com

ఈ క్రమంలోనే నటి, నిర్మాత ఛార్మి పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే ఈమె పూరికి చెప్పిన బర్త్డే విషెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మందు గ్లాస్ చేతిలో పట్టుకొని… నాకెంతో ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.మీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు.మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కోసం ప్రయత్నిస్తుంటా.అని చెబుతూ పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ కుర్చీలో కూర్చుని ఉండగా ఈమె మందు గ్లాస్ చేతిలో పట్టుకొని ఉన్నటువంటి ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సినిమాల విషయానికి వస్తే పూరి జగన్నాథ్ చార్మి నిర్మాతలుగా విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో “లైగర్” చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube