ఛార్మీ నువ్వు పెట్టింది కుక్కలు కూడా తినవు.. నెటిజన్స్ కామెంట్లు వైరల్!

Charmi Your Food Dogs Also Do Not Eat Netizens Comments Viral

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి ఛార్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎన్నో సినిమాలల్లో  నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఛార్మి కొంతకాలం సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.

 Charmi Your Food Dogs Also Do Not Eat Netizens Comments Viral-TeluguStop.com

అయితే తనకు అవకాశాలు వచ్చినప్పటికీ తన సినిమాల్లో  నటించలేదనే విషయాన్ని ఛార్మి వెల్లడించారు.ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమైన ఛార్మి ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా నిర్మాతగా మారి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో దర్శకుడిగా పూరి జగన్నాథ్, నిర్మాతగా చార్మి మరోసారి ఇండస్ట్రీలో తమ హవాను కొనసాగిస్తున్నారు.

 Charmi Your Food Dogs Also Do Not Eat Netizens Comments Viral-ఛార్మీ నువ్వు పెట్టింది కుక్కలు కూడా తినవు.. నెటిజన్స్ కామెంట్లు వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో కలిసి ఛార్మి సంయుక్తంగా నిర్మాణ రంగంలో పనిచేస్తూ లైగర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.పూరి జగన్నాథ్ ఛార్మి, విజయ్ దేవరకొండ ముగ్గురి కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి.ముఖ్యంగా ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఉండడంతో అంతర్జాతీయంగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

Telugu Charmi, Puri Jagannadh, Dogs, Liger, Netizens Trolls, Spanish Americs, Tollywood-Movie

ఇకపోతే మైక్ టైసన్ తో విజయ్ దేవరకొండ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం కోసం గత కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్లిన చిత్రబృందం అక్కడ షూటింగ్ సన్నివేశాలను పూర్తి చేసుకుంది.షూటింగ్ పూర్తి అయిన ప్పటికీ చిత్రబృందం అమెరికా వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఛార్మి అమెరికా వీధులలో సైకిల్ పై వెళుతూ తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ తింటూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Charmi, Puri Jagannadh, Dogs, Liger, Netizens Trolls, Spanish Americs, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఛార్మి సోషల్ మీడియా వేదికగా తనకెంతో ఇష్టమైన ఆహార పదార్థాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.స్పానిష్ ఫుడ్ ఇన్ అమెరికా అంటూ పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు స్పందిస్తూ ఈ ఫోటో పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

కొందరు ఈ ఫోటో పై స్పందిస్తూ చూస్తుంటేనే ఎంతో రుచికరంగా ఉంటుంది అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాకు పంపించండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక మరికొందరైతే ఇలాంటి ఆహార పదార్థాలను కుక్కలు కూడా తినవు అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి ఈ ఫోటో ద్వారా ఛార్మి మరోసారి వార్తల్లో నిలిచారు.

Telugu Charmi, Puri Jagannadh, Dogs, Liger, Netizens Trolls, Spanish Americs, Tollywood-Movie

ఇక సినిమా విషయానికి వస్తే అమెరికా షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తయిందనీ సమాచారం ఇక ఇందులో ఏదైనా ప్యాచ్ వర్క్ ఉంటే వాటిని పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు.

#Puri Jagannadh #Spanish Americs #Charmi #Liger #Dogs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube