ఫైటర్ కోసం లుక్ మారుస్తున్న విజయ్ దేవరకొండ... ట్వీట్ చేసిన ఛార్మి

ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో ప్లాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ని ఇప్పటికే ఫిక్స్ చేశారు.

 Charmi Shares Vijay Devarakonda New Look For Fighter-TeluguStop.com

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అ బాక్సర్ గా తెరపై కనిపించబోతున్నాడు.ఇక టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ హీరో అంటే డిఫరెంట్ మాస్ లుక్ ఉంటుంది.

అతను సినిమాలో నటించే హీరో ఆ తర్వాత కమర్షియల్ గా ఒక రేంజ్ లో దూసుకుపోతాడు.క్లాస్ గా కనిపించే రామ్ నీ కూడా పూరి జగన్నాథ్ తనకు సరిపోయే రేంజ్ లో మార్చుకున్నాడు.

ఇక పూరి దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ఈస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

ఇదే జోష్ లో ఫైటర్ మీద దృష్టిపెట్టిన పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ లుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు దీనికోసం ముంబైలో సిటింగ్ ఏర్పాటుచేసి బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ దగ్గర విజయ్ దేవరకొండ హెయిర్ స్టైల్ ను సెట్ చేసే పనిలో పడ్డాడు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఫోటోను మాజీ హీరోయిన్, నిర్మాత ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా కొత్త లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.

పూరి జగన్నాథ్ హీరోగా విజయ్ దేవరకొండ ఎంతవరకు ప్రేక్షకుల్ని మెప్పించాడు అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube