జీవితంలో మళ్లీ అది చేయనంటున్న ఛార్మీ..!

Charmi Sensational Comments On Acting

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన ఛార్మీ కౌర్ స్క్రీన్ మీద కనిపించడం మానేసింది.హీరోయిన్ గా మంచి మంచి ఛాన్సులు వచ్చినా సరే కెరియర్ ను అర్ధాంతరం గా ఆపేసింది ఛార్మీ.

 Charmi Sensational Comments On Acting-TeluguStop.com

పోనీ సినిమాలకు టచ్ లో లేకుండా పోయిందా అంటే పూరీతో కలిసి నిర్మాతగా సెటిల్ అయ్యింది.పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందుకుంటున్నాయి.

ఇస్మార్ట్ శంకర్ తో పాటుగా రాబోతున్న రొమాంటిక్, లైగర్ సినిమాలు కూడా పూరీ, ఛార్మీ కలిసి నిర్మిస్తున్నారు.

 Charmi Sensational Comments On Acting-జీవితంలో మళ్లీ అది చేయనంటున్న ఛార్మీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక రొమాంటిక్ సినిమా రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఛార్మీ తను స్క్రీన్ మీద కనిపించే అవకాశం లేదని చెప్పింది.

ఇప్పటికి వారానికి రెండు మూడు ఆఫర్లు వస్తున్నాయని చెప్పిన ఛార్మీ తను నటనకు ఫుల్ స్టాప్ పెట్టానని అంటుంది.ఏదైనా ఉంటే ఇక నిర్మాతగా కొనసాగడమే అంతే తప్ప ఇక జీవితంలో నటించేది లేదు అని అంటుంది ఛార్మీ.

మరి ఛార్మీ కౌర్ అంత గట్టిగా ఫిక్స్ అవడానికి కారణం ఏంటన్నది మాత్రం అర్ధం కాలేదు.ఏది ఏమైనా ఛార్మీ నిర్మాతగా అయినా ప్రేక్షకుల మనసులు గెలవాలని ఆశిద్దాం.

#Aakash Puri #Puri Jagannadh #CharmyKaur #Charmi #Charmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube