త్రిష సీక్రెట్ బయటపెట్టిన చార్మి

సౌత్ లో లో ప్రస్తుతం ఉన్నవారిలో మోస్ట్ సీనియర్ హీరోయిన్ ఎవరంటే త్రిష అని చెప్పొచ్చు.ఆమె నటిగా కెరియర్ ప్రారంభించి 23 ఏళ్ళు పూర్తి చేసుకుంది.జోడీ సినిమాలో సిమ్రాన్ ఫ్రెండ్ పాత్రతో ఆమె నటిగా ప్రస్తానం మొదలు పెట్టి తరువాత కోలీవుడ్ లో హీరోయిన్ గా టర్న్ తీసుకుంది.2003లో నీ మనసు నాకు తెలుసు సినిమాతో టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసింది.తరువాత వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తన కెరియర్ ని మరింత స్పీడ్ అప్ చేసుకుంది.ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఏకంగా పదేళ్ళ పాటు ఆమె స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది.

 Charmi Reveals About Trisha Marriage Secret-TeluguStop.com

తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోలు అందరితో జత కట్టింది.ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయకున్నా తమిళ్ లో మాత్రం ఫిమేల్ సెంట్రిక్ కథలతో త్రిష్ దూసుకుపోతుంది.

ప్రస్తుతం ఆమె నటిస్తున్న మూడు సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.

 Charmi Reveals About Trisha Marriage Secret-త్రిష సీక్రెట్ బయటపెట్టిన చార్మి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

వాటిలో మణిరత్నం పొన్నియన్ సెల్వన్ కూడా ఉండటం విశేషం.ఇదిలా ఉంటే గతంలో త్రిష ఓ వ్యక్తి ప్రేమించి నిశ్చితార్ధం కూడా చేసుకుంది.

తరువాత అతనికి బ్రేక్ అప్ చెప్పేసింది.సినిమాలకి దూరంగా ఉండాలని కండిషన్ పెట్టడంతోనే అతనితో తెగతెంపులు చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు త్రిష త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది.అయితే ఈ విషయాన్ని ఆమె నేరుగా బయట పెట్టలేదు.

త్రిషకి టాలీవుడ్ లో చార్మి మంచి ఫ్రెండ్.అయితే తాజాగా త్రిష పుట్టినరోజు సందర్భంగా ఛార్మి తన ట్వీట్ లో త్రిష బ్యాచురలరేట్ గా జరుపుకునే చివరి పుట్టిన రోజు ఇది అని అంది.

దీనికి త్రిష నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆమె ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది.తమిళనాడుకి చెంధిక ఓ వ్యాపారవేత్తని త్రిష పెళ్లి చేసుకోబోతుందని కోలీవుడ్ లో ఇప్పుడు టాక్ వినిపిస్తుంది.

#Marriage Secret #South Heroines #Actress Trisha #Actress Charmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు