యాక్టింగ్ బోర్ కొట్టేసింది అంటున్న ఆ హీరోయిన్! ఇకపై నిర్మాతగానే  

యాక్టింగ్ బోర్ కొట్టేసింది అంటున్న చార్మీ. .

Charmi Kaur Not Interested To Acting In Movies-not Interested To Acting In Movies,telugu Cinema,tollywood

టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్స్ పరిచయం అయ్యారు. వాళ్ళలో కొంత మంది దశాబ్దం కెరియర్ కొనసాగించి తరువాత ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోయారు. హీరోయిన్ గా చేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన వాళ్ళు ఉన్నారు..

యాక్టింగ్ బోర్ కొట్టేసింది అంటున్న ఆ హీరోయిన్! ఇకపై నిర్మాతగానే-Charmi Kaur Not Interested To Acting In Movies

అయితే వీళ్ళలో హీరోయిన్ చార్మీ రూట్ సెపరేట్ అని చెప్పాలి. హీరోయిన్ గా స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు అందరితో చేసిన ఈ భామ చివరికి జ్యోతిలక్ష్మి అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేసిన తర్వాత పూర్తిగా నటనకి దూరం అయిపోయింది. తక్కువ వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చార్మీ కెరియర్ లో అందరి కంటే ఎక్కువ సినిమాలే చేసింది.

ఇదిలా ఉంటే నటనకి స్వస్తి చెప్పిన తర్వాత చార్మీ పూరీ జగన్నాథ్ట్ తో జట్టు కట్టి అతని టీంలో ఒక నెంబర్ గా మారిపోవడంతో పాటు, నిర్మతాగా కూడా మారిపోయింది. ఇక తన చివరి చిత్రం జ్యోతిలక్ష్మికి చార్మీనే నిర్మాత అనే విషయం అందరికి తెలిసిందే. పూరీ నిర్మించే ప్రతి సినిమాలో కూడా ఇప్పుడు చార్మీ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటూ వస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకి కూడా చార్మీ నిర్మాణ భాగస్వామిగా ఉంది. తాజాగా మీడియా ముందుకొచ్చిన ఈ భామని మీడియా ప్రశ్నిస్తూ మరి కెమెరా ముందుకి వచ్చే ఆలోచన లేదా అని అడిగితే, నటన ఫుల్ బోర్ కొట్టిందని, అందుకే ఇక కెమెరా ముందుకి వచ్చే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. జ్యోతిలక్ష్మి తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయని అయితే తానే వదులుకున్నట్లు చార్మీ చెప్పడం విశేషం.