అభిమాని చేసిన పనిపై ఛార్మి క్రేజీ రియాక్షన్.. ఏంటంటే!- Charmi Comments On Vijay Devarakonda Fan Permanent Tattoo

charmi crazy reaction over vijay devarakonda fan, charmi comments , vijay devarakonda fan , movie ,permanent tattoo, liger, saala crossbreed poori jagannath - Telugu Charmi Comments, Liger, Movie, Permanent Tattoo, Vijay Devarakonda, Vijay Devarakonda Fan

సాధారణంగా తమకిష్టమైన సినీ సెలబ్రిటీస్ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్క అభిమాని ఇష్టపడుతుంటారు.తమకు నచ్చిన హీరో హీరోయిన్ల పై ఉన్న అభిమానం ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యక్తపరుస్తుంటారు.

 Charmi Comments On Vijay Devarakonda Fan Permanent Tattoo-TeluguStop.com

కొందరు థియేటర్ల ముందు పెద్ద పెద్ద ఫ్లెక్సీల ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటారు.మరికొంతమంది వారి పుట్టిన రోజుకు కేక్ కట్ చేయడం, వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి చేయడం సర్వసాధారణమే.

కానీ యువ హీరో విజయ్ దేవరకొండ అభిమాని చేసిన పని చూసిన ఛార్మి ఎంతో ఆశ్చర్యపోయారు.

 Charmi Comments On Vijay Devarakonda Fan Permanent Tattoo-అభిమాని చేసిన పనిపై ఛార్మి క్రేజీ రియాక్షన్.. ఏంటంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈరోజు ఉదయం దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా పేరును విడుదల చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.

వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రూపంలో తెరకెక్కనుంది.ఈ చిత్రానికి “లైగర్” అని విభిన్నమైన టైటిల్ పెట్టడంతోపాటు  ‘సాలా క్రాస్‌బ్రీడ్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు.

దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు తనపై ఉన్న అభిమానాన్ని విభిన్న రీతిలో తెలియజేశారు.

ఈ విధంగా విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా పేరు విడుదల చేయగానే ఓ అభిమాని తన చేతిపై లైగర్ అనే పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియోను ఛార్మి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఎంతో క్రేజీ గా రియాక్ట్ అయ్యింది.పిచ్చి మరో స్థాయికి చేరిందంటూ, ఈ సినిమాపై మీరు పెట్టుకున్న నమ్మకానికి గర్వపడుతున్నా అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ లైగర్ సినిమా నిర్మాణంలో ఛార్మి భాగమవుతున్నారు.

ఈ సినిమాలు విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటిస్తున్నారు.

https://twitter.com/i/status/1351122091190480909
#Charmi Comments #Liger

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు