నువ్వు బంగారం అంటూ విజయ్ ఫోటోను షేర్ చేసిన ఛార్మి.. పిక్ వైరల్..!

చిన్న వయసులోని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ ఛార్మి కౌర్. ఈమె హాట్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది.

 Charmee Kaur Shares Vijay Deverakonda Photo-TeluguStop.com

గత కొన్ని రోజులుగా నటనకు దూరంగా ఉంటూ నిర్మాణ రంగంలోకి పూరీ జగన్నాథ్ తో కలిసి అడుగు పెట్టింది.తాజాగా ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ పై ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

 Charmee Kaur Shares Vijay Deverakonda Photo-నువ్వు బంగారం అంటూ విజయ్ ఫోటోను షేర్ చేసిన ఛార్మి.. పిక్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిన్న విజయ్ పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ లో ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఛార్మి కూడా విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విష్ చేస్తూ ఆయన గురించి ఒక్క మాటలో తెలిపారు.ఆయన పట్ల ఉన్న అభిమానంతో సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసారు ఆ పిక్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

ఆమె పోస్ట్ చేస్తూ. నీ గురించి ఒక్క లైన్ లో అని.నువ్వు 26 క్యారెట్ల బంగారం అని షేర్ చేసింది.

ఆమె చేసిన ఫోటో అభిమానులను బాగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఛార్మి నిర్మాణంలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవాలని చాలా శ్రమిస్తున్నాడు.

పూరీ కూడా అదే టార్గెట్ తో విజయ్ ను కొత్తగా ప్రెసెంట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాడు.

లైగర్ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

ఈ సినిమా కోసం విజయ్ స్పెయిల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యి విశేష ఆదరణ పొందింది.విజయ్ పుట్టిన రోజు కానుకగా టీజర్ విడుదల అవ్వబోతుందని ఆశించిన ఫ్యాన్స్ కు.ఎలాంటి టీజర్ విడుదల అవ్వకపోవడంతో నిరాశే ఎదురైంది.

#Charmee Kaur #CharmeeKaur #Social Media #Puri Jagannath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు