మొదలైన చార్‌ధామ్ యాత్ర... కానీ వారికి మాత్రమే..

అన్ లాక్ 1.0 తోనే దేశంలో చాలా వరకూ ఆలయాలు తెరుచుకోవడంతో ప్రజలు దేవుడుని దర్శించుకోవడం మొదలుపెట్టారు.అయితే కొన్ని ప్రాంతాల్లో దేవాలయాలు ఆ సమయంలో తెరుచొకాక పోవడంతో అవి కూడా అన్ లాక్ 2.0 నుండి సడలింపులు పొందడంతో ఆ ప్రాంతాలలో ఉన్న దేవాలయాలలోకి భక్తులను అనుమతిస్తున్నారు.సడలింపుల నేపథ్యంలో హిందూ ప్రజలకు ఎంతో పవిత్రమైన చార్‌ధామ్ యాత్ర మొదలైంది.ఇందుకు సంబంధించి బుధవారం నుండి కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయం లోకి భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నారు.

 Uttarakhand Government, Chardham Yatra, Corona Effect, Unlock1.0, Lockdown-TeluguStop.com

ఇకపోతే కరోనా వైరస్ నేపథ్యంలో బయట రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు మాత్రం దర్శనానికి అనుమతించడం లేదు.కేవలం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వారికి మాత్రమే ఈ యాత్రకు అనుమతి ఇస్తున్నారు.

ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఈ-పాస్ లను కూడా జారీ చేసింది.

Telugu Chardham Yatra, Corona Effect, Lockdown, Unlock, Uttarakhand-

ఇక ఇందులో గంగోత్రి ఆలయానికి 55, కేదార్నాథ్ ఆలయానికి 165, బద్రీనాథ్ ఆలయానికి 154, యమునోత్రి ఆలయానికి 48 పాసులను ఉత్తరాఖండ్ ప్రభుత్వ దేవస్థానం మేనేజ్మెంట్ బోర్డు ఈ-పాస్ లను జారీ చేసింది.అయితే భక్తుల రాక నేపథ్యంలో ప్రతి ఆలయానికి సంబంధించిన మేనేజ్మెంట్ బోర్డులు అత్యంత భద్రతా చర్యల నడుమ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు ఈ-పాస్ లను ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందజేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube