చరణ్ పూజ రొమాంటిక్ సాంగ్ లీక్.. ఆందోళనలో చిత్ర యూనిట్..!

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి స్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.చిరంజీవి 152 వ సినిమాగా ఈ చిత్రం రాబోతుంది.

 Charan Pooja Romantic Song Leaked In Acharya Movie, Acharya, Ram Charan, Pooja H-TeluguStop.com

ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఆచార్య సినిమాను కొరటాల శివ సామజిక అంశాలతో రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాను కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర దాదాపు 45 నిముషాల పాటు ఉంటుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర పేరు సిద్ధ.

చిరంజీవి, చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయని డైరెక్టర్ తెలిపారు.ఈ సినిమా కోసం దాదాపు 20 కోట్లు ఖర్చు చేసి మరి ధర్మస్థలి అనే భారీ ఆలయం సెట్ వేసి అందులోనే సినిమా షూటింగ్ చేస్తున్నారు.

Telugu Acharya, Charanpooja, Chiranjeevi, Pooja Hegde, Ram Charan-Movie

ఆచార్య లో రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.పూజ హెగ్డే రామ్ చరణ్ సరసన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కొద్దీ సమయం కనిపించి ప్రేక్షకుల్ని అలరించ బోతుంది.ఇందులో రామ్ చరణ్, పూజ హెగ్డే మీద ఒక సాంగ్ కూడా ఉంటుందట.ఇప్పటికే ఈ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తి అయ్యింది.ఈ సినిమాలో పూజ నీలాంబరి పాత్రలో నటిస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక పాట లీక్ అయ్యింది.

ఈ సాంగ్ రామ్ చరణ్, పూజ మధ్య వచ్చే నీలాంబరి సాంగ్ అని తెలుస్తుంది.ఈ సాంగ్ బయటకు రావడంతో ఇప్పుడు చిత్ర యూనిట్ లో ఆందోళన మొదలయ్యింది.

ఎంత పకడ్బందీగా ఉన్న కూడా ఇలా లీక్ అవ్వడంతో ఏం చేయాలా అని చిత్ర యూనిట్ ఆలోచనలో పడ్డారు.ఇప్పటికే ఈ సాంగ్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకుల్లో ఆత్రుత పెరిగింది.

ఇప్పుడు ఈ సాంగ్ బయటకు రావడంతో అది విన్న ఫ్యాన్స్ ఈ సాంగ్ ఎప్పుడు విడుదల అవుతుందో అని ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube