నిర్మాణంపై శ్రద్ద పెట్టలేక పోతున్న చరణ్‌, కేవలం సమర్పకుడిగా మాత్రమే

మెగా స్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం.150 తో నిర్మాతగా మారిన రామ్‌ చరణ్‌ ఆ తర్వాత సైరా సినిమాను భారీ బడ్జెట్‌ తో నిర్మించాడు.ఆ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి.కాని బడ్జెట్‌ ఎక్కు అవ్వడంతో లాభాలు రాకపోగా నష్టాలు మిగిలాయి.రెండు సినిమాలను నిర్మించిన రామ్‌ చరణ్‌ చిరు తో మూడవ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.ఆచార్యకు మొదట చరణ్‌ మాత్రమే నిర్మాత.

 Charan Not Showing Intrested In Production Deportment, Ram Chran, Chiranjeevi, A-TeluguStop.com

కాని కొరటాల అభ్యర్థణ మేరకు ఆయన సన్నిహితుడు అయిన నిరంజన్‌ రెడ్డిని కూడా నిర్మాణంలోకి తీసుకున్నారు.

మొదట నిరంజన్‌ రెడ్డిది నిర్మాతగా తక్కువ షేరే.

కాని చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ కారణంగా ఈ సినిమా నిర్మాణంపై దృష్టి పెట్టలేక పోవడం మరియు ఆచార్య లో నటిస్తున్న చిరంజీవి కూడా నిర్మాణ పరమైన విషయాలపై ఆసక్తి చూపక పోవడం వల్ల నిర్మాణ భాగస్వామ్యం నుండి తప్పుకోవాలనుకున్నారా అంటూ వార్తలు వచ్చాయి.అయితే చిరంజీవి మరియు చరణ్‌ లు నటిస్తున్నారు.

కనుక వారి పారితోషికం బడ్జెట్‌ గా నిర్మాతగా ఉండాలని నిరంజన్‌ మరియు కొరటాలలు కోరారట.అందుకు చరణ్‌ ఓకే అన్నట్లుగా తెలుస్తోంది.

చరణ్‌

పెట్టుబడి పెట్టకుండా నిర్మాత అయ్యాడు.వచ్చే లాభాల్లో వాటా తీసుకోవడంతో పాటు సినిమాకు సమర్పకుడిగా ఒక నిర్మాతగా కూడా చరణ్‌ పేరు ఉంటుందని తాజాగా విడుదలైన మోషన్‌ పోస్టర్‌ చూస్తుంటే అంర్థం అవుతోంది.

ఈ చిత్రంలో చరణ్‌ పాత్ర విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.కనుక వచ్చే ఏడాదిలో సినిమాను పట్టాలెక్కించి అసలు విషయాన్ని క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube