అవును స్వార్థంతోనే ఆ పని చేశా... నోరెళ్లబెట్టే నిజాలు చెప్పిన రామ్‌ చరణ్‌     2019-01-09   10:02:15  IST  Ramesh Palla

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా రూపొందిన ‘వినయ విధేయ రామ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న వినయ విధేయ రామ చిత్రంపై చరణ్‌ చాలా నమ్మకంతో ఉన్నాడు.

Charan Explains About His Entry In Production Department-Chiranjeevi Naga Babu Nagababu Comments On Balayya Ram Producing Movie Saira Narasimha Reddy Viral Ram

Charan Explains About His Entry In Production Department

మెగా ఫ్యాన్స్‌కు మాస్‌ ట్రీట్‌ అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. నిర్మాతగా మారడం వెనుక ఉన్న కారణం ఏంటీ, చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంకు సంబంధించిన అప్‌ డేట్స్‌ ఏంటీ, ఆ తర్వాత తాను చేస్తున్న మల్టీస్టారర్‌ మూవీ వివరాలను చరణ్‌ చెప్పుకొచ్చాడు.

చరణ్‌ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… నేను నిర్మాత అవ్వడం అనేది నిజంగా చెప్పాలంటే స్వార్థంతోనే అయ్యాను. ఎందుకంటే నాన్నగారితో సినిమా నిర్మించే అవకాశం నాకు మాత్రం రావాలని, ఆయన రీ ఎంట్రీ సినిమా అయినా, ప్రతిష్టాత్మక సైరా చిత్రం అయినా నిర్మించి ఆ పేరును నేను నా ఖాతాలో వేసుకోవాలనుకున్నాను. అందుకే ఆ స్వార్థంతోనే నిర్మాతగా మారాను అంటూ చెప్పుకొచ్చాడు. డబ్బు కోసం నిర్మాతగా అయితే తాను మారలేదని కూడా అన్నాడు. ఇక చిరంజీవి సైరా చిత్రం గురించి మాట్లాడుతూ మెగా ఫ్యాన్స్‌ ఎప్పటికి గుర్తుంచుకునే సినిమాల సైరా ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు.

సైరా సినిమా భారీ బడ్జెట్‌ సినిమా అవ్వడంతో పాటు, ఎక్కడ రాజీ పడకుండా సినిమాను తీస్తున్నాం. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆలస్యం అవుతుంది.

అంతే తప్ప సైరా సినిమాకు ఎక్కడ, ఎప్పుడు కూడా రీ షూట్స్‌ చేయలేదని చెప్పుకొచ్చాడు.

Charan Explains About His Entry In Production Department-Chiranjeevi Naga Babu Nagababu Comments On Balayya Ram Producing Movie Saira Narasimha Reddy Viral Ram

సైరా రీ షూట్స్‌ కారణంగా ఆలస్యం అవుతుందని వస్తున్న వార్తలపై చరణ్‌ క్లారిటీ ఇచ్చాడు. రామ్‌ చరణ్‌ ఇక తాను నటిస్తున్న ఆర్‌ మల్టీస్టారర్‌ గురించి మాట్లాడుతూ ఒక అద్బుతమైన సినిమాలో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.