టూర్ కు చెక్కేస్తున్న చరణ్..!  

charan checking in for the tour, Ram Charan, ntr, Mahesh Babu, foreign tour, lock down, caraona virus, covid 19 - Telugu Caraona Virus, Covid-19, Foreign Tour, Lock Down, Mahesh Babu, Ntr, Ram Charan

టాలీవుడ్ ప్రముఖ హీరోస్ చాలా మంది షూటింగ్స్ మధ్య కొంచం సమయం దొరికినా తమ ఫ్యామిలీస్ తో ఫారిన్ టూర్లకి వెళ్లి వస్తుంటారు.విదేశాలలో వాళ్ళ ఫామిలీ ఇంకా పిల్లలతో సేద తీరుతూ రిలాక్స్ అవుతుంటారు.

TeluguStop.com - Charan Checking In For The Tour

కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ లేక దాపుగా అందరు సినీ నటీనటులు గత ఏడూ నెలలు నుండి ఇంటికే పరిమితం అయ్యారు.ఇప్పుడు అందరూ ఒక్కొక్కరిగా బయటికి వస్తూ, షూటింగ్స్ కూడా మొదలు పెట్టారు.

ఇప్పుడు మరలా షూటింగ్స్ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని మరి వారి ఫ్యామిలీస్ తో కలిసి ఫారిన్ టూర్స్ ప్లాన్ చేస్తున్నారు మన ప్రముఖ హీరోలు.

TeluguStop.com - టూర్ కు చెక్కేస్తున్న చరణ్..-General-Telugu-Telugu Tollywood Photo Image

గత ఏడు నెలలుగా నటి నటులు ఇంట్లోనే ఉంటూ, ఫ్యామిలీస్ తో సమయం గడిపినప్పటికీ విదేశాలు వెళ్లి సేద తీరడమే అసలైన ఎంజాయ్ మెంట్ గా ఫీల్ అవుతారు మన హీరోలు.

మొన్నటివరకు కరోనా కారణంగా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి.ప్రస్తుతం మళ్ళి ఆంక్షలు ఎత్తివేయడంతో తిరిగి షూటింగులు స్టార్ట్ అయ్యాయి.ఇంత బిజీలో ఉన్నాకొంత సమయం చూసుకుని మరి ఫారెన్ టూర్ వెళ్లి వస్తున్నారు మన యంగ్ హీరోలు.దానికి తగ్గట్టుగా షూటింగ్ డేట్స్ ని కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నారు.

మొన్ననే మన హీరో ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి అమెరికా చుట్టేసి వచ్చాడు.ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ షెడ్యూల్ ఒక్కటి అక్కడే ప్లాన్ చేశాడు దర్శకుడు పరశురామ్.

ఇప్పుడు రీసెంట్ గా మన జూనియర్ ఎన్టీఆర్ కూడా కుటుంబంతో దుబాయ్ వెళ్లి ఇండియాకి తిరిగి వచ్చాడు.కొద్దీ రోజులు అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి, తిరిగి వచ్చాక వెంటనే దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ట్రిపుల్ ఆర్ మూవీ షూటింగ్ లో బిజీ అయిపోయాడు.

ఎన్టీఆర్ తిరిగి రావటంతో వెంటనే మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసనతో కూడా కొద్దీ రోజుల పాటు దుబాయ్ వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు వినికిడి.చరణ్ వచ్చేవారుకు జూనియర్ ఎన్టీఆర్ పై కొన్ని సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి.

చెర్రీ తిరిగి వచ్చాక వాళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ చిత్రీకరించాలని రాజమౌళి ప్లాన్.చెర్రీ నవంబర్ నెలాఖరులో టూర్ కి వెళ్తున్నట్లు సమాచారం.ఇంత బిజీ షెడ్యూల్స్ లో కూడా తమ ఫామిలీస్ తో ఇలా సమయం కేటాయిస్తున్నారంటే వాళ్ళకి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారని అర్ధం.ఏది ఏమైనా మన హీరోలకు ఫ్యామిలీ తరువాతే ఏదైనా అని దీనితో అర్ధం అవుతుంది.

#Caraona Virus #Ram Charan #Lock Down #COVID-19 #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Charan Checking In For The Tour Related Telugu News,Photos/Pics,Images..