సినిమాల్లో చిన్న పాత్రలు వేసి స్టార్స్ గా మారిన టాలీవుడ్ ప్రముఖులు వీరే.. వారెవరో చూడండి..  

Character Artists Turns Into Big Stars In Tollywood-

1.అనసూయ

అనసూయ ఈ పేరు చెప్పగానే జబర్దస్త్ గుర్తుకొస్తుంది.దానితో పాటు ఇప్పుడు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ సినిమాల్లో బిజీ అయింది.ఈమె నాగ సినిమాలో కొన్ని సెకండ్లు అలా కనిపించి వెళ్ళిపోతుంది.

Character Artists Turns Into Big Stars In Tollywood--Character Artists Turns Into Big Stars In Tollywood-

Character Artists Turns Into Big Stars In Tollywood--Character Artists Turns Into Big Stars In Tollywood-

2.నిఖిల్

హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిఖిల్ , తరువాత వరసగా చేసిన సినిమాలన్నీ పరాజయం అయిన మళ్ళీ మంచి సబ్జెక్ట్ లు ఎంచుకొని వరుస హిట్ లతో దూసుకుపోతున్న ఈ నటుడు .

సంబరం అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపిస్తాడు.

3.సిద్దార్థ్

బాయ్స్ , బొమ్మరిల్లు , నువ్వొస్తానంటే వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి అమ్మాయిల మనస్సులు దోచుకున్న సిద్దార్థ్ నటనలోకి రాకముందు మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ గా పని చేసారు.అమృత అనే సినిమాలో బస్ లో ఒక్క చిన్న పాత్రలో కనిపిస్తాడు సిద్దార్థ్.

4.సంపూర్ణేష్ బాబు

హృదయ కాలేయం అనే సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని , తెలుగు బిగ్ బాస్ లు ప్రేక్షకులను అలరించిన సంపూర్ణేష్ బాబు .హృదయ కాలేయం అనే సినిమాకి ముందే మహాత్మా సినిమాలో చిన్న రాజకీయ నాయకుడు పాత్రలో కనిపిస్తాడు.

5.రవితేజ

మాస్ రాజా రవితేజ ఇప్పుడు ఒక స్టార్ హీరో , సినిమాలతో ఎప్పుడు బిజీ గా ఉండే రవితేజ , సినిమాల్లో కి రావడానికి చాలా కష్ట పడ్డాడు .ఈయన అల్లరి ప్రియుడు సినిమాలో రాజశేఖర్ స్నేహితుల బ్యాచ్ లో ఒకడిగా నటించాడు.

6.సునీల్

తెలుగు సినిమాలో తన కామెడీ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించి తరువాత సినిమా హీరో గా మారిన నటుడు సునీల్ , ఈయన ఎవరికి అంత పెద్దగా తెలియని రోజుల్లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో ఒక సీన్ లో అలా కనిపించి వెళ్ళిపోతాడు.

7.శ్రీకాంత్ అడ్డాల

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , కొత్త బంగారు లోకం లాంటి హిట్ సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల , ఆర్య సినిమాలో ఒక్క సీన్ లో కనిపిస్తాడు.

8.పూరి జగన్నాథ్

పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో దాదాపు ప్రతి స్టార్ హీరో తో సినిమాలు చేసిన ఈ దర్శకుడు.శివ సినిమాలో బొటనీ క్లాస్ ఉంది పాటలో కనిపిస్తారు.

9.అనిల్ రావిపూడి

పటాస్ , సుప్రీం , రాజా ది గ్రేట్ , f2 వంటి వరుస హిట్ సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ .గోపి చంద్ నటించిన శౌర్యం సినిమాలో ఒక్క సీన్ లో మనకి కనిపిస్తాడు.

10.విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఇప్పుడు ఎక్కువ మంది యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరో.అర్జున్ రెడ్డి సినిమాతో అమాంతం స్టార్ హీరోగా ఎదిగిన ఈ హీరో , గీత గోవిందం తో 100 కోట్ల వసూళ్లు చేసిన నటుల జాబితాలో చేరిపోయాడు.విజయ్ స్టార్ కాకముందు నువ్విలా , లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాల్లో కనిపించాడు.

వీరితో పాటు యాంకర్ రష్మీ , వంశీ పైడిపల్లి , హరీష్ శంకర్ మరికొంత మంది టాలీవుడ్ స్టార్స్ మనకి తెలియని చాలా సీన్ లలో కనిపించారు.