రాజమౌళికి జక్కన్న అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా?

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, రాజమౌళి కాంబినేషన్ లో చాలా సినిమాలు తెరకెక్కాయి.ప్రస్తుతం రాజమౌళి విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో సైతం రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటిస్తున్నారు.

 Character Artist Rajeev Kanakala Behind Rajamouli Jakkanna Name-TeluguStop.com

తాజాగా రాజీవ్ కనకాల రాజమౌళి గురించి, ఆయనకు జక్కన్న అనే పేరు ఎలా వచ్చిందో చెబుతూ కీలక విషయాలను వెల్లడించారు.టాలీవుడ్ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన రాజమౌళి సినిమా కోసం చాలా కష్టపడతారనే సంగతి తెలిసిందే.

రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది.సినిమాలో ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు టేక్ మీద టేక్ తీస్తూ తెరపైన రాజమౌళి అద్భుతాలను ఆవిష్కరిస్తూ ఉంటారు.

 Character Artist Rajeev Kanakala Behind Rajamouli Jakkanna Name-రాజమౌళికి జక్కన్న అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజమౌళికి జక్కన్న అని పెట్టాననే సంగతి గురించి రాజీవ్ కనకాల చెబుతూ నా సీన్ షూటింగ్ 6 గంటలకు అయితే 10 గంటలకు స్టార్ట్ అవుతుందని రాజమౌళి అంతకు ముందు మొదలుపెట్టిన సీన్ తోనే బిజీగా ఉంటారని రాజీవ్ కనకాల అన్నారు.

ఒక సీన్ ను ఎన్ని విధాలుగా తీయవచ్చో అన్ని విధాలుగా రాజమౌళి షాట్స్ తీస్తారని ఒక సీన్ పూర్తైతే మాత్రమే మరో సీన్ జోలికి వెళతారని రాజీవ్ కనకాల తెలిపారు.ఒకరోజు హాఫ్ పేజ్ సీన్ షూటింగ్ జరగాల్సి ఉండగా ఆ సీన్ కోసం రాత్రి 12.30 గంటలు అయిందని ఆ సమయంలో రాజమౌళి పని రాక్షసుడని జక్కన్నలా సీన్లను చెక్కుతున్నాడని అనుకున్నానని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

అయితే ప్రస్తుతం జక్కన్న పేరు బ్రాండ్ అయిందని సొంత పేరు కంటే జక్కన్న అనే పేరు ఎక్కువగా పాపులారిటీని తెచ్చుకుందని రాజమౌళి గురించి రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.ఆర్ఆర్ఆర్ లో రాజీవ్ కనకాల పాత్ర గురించి ప్రశ్నలు ఎదురు కాగా రాజమౌళి షరతులు విధించడంతో చెప్పడానికి ఇష్టపడలేదు.

#Rajamouli #RajivKanakala #Jakanna #RRR #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు