అమ్మాయిలు అందంగా ఉంటే చాలు ఆఫర్లు ఇస్తారంటున్న ప్రగతి...

పలు తెలుగుల చిత్రాలలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా పని చేసినటువంటి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు. అయితే నటి ప్రగతి టాలీవుడ్ చిత్రాలలో అక్క, అమ్మ, వదిన, చెల్లెలు తదితర పాత్రల్లో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది.

 Pragathi, Tollywood Character Artist, Sensational Comments , Casting Couch, Telu-TeluguStop.com

కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో నటి ప్రగతి పాల్గొని పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం సినిమా పరిశ్రమలో టాలెంట్ కి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కేవలం అమ్మాయిల అందాన్ని చూసి కొందరు దర్శకనిర్మాతలు అవకాశాలను ఆఫర్ చేస్తున్నారని పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేసింది.

అంతేకాక సినీ పరిశ్రమకు వచ్చేటువంటి నూతన నటీనటులను అవకాశాల పేరుతో కమిట్మెంట్ అడుగుతున్నారని, ఒకానొక సమయంలో తాను అలాంటి కమిట్మెంట్లు ఇవ్వలేని కారణంగానే చాలా సినీ అవకాశాలు కోల్పోయానని చెప్పుకొచ్చింది.

దీంతో ఈ విషయంపై స్పందిస్తూ ఇటువంటి కొందరు నెటిజన్లు ప్రస్తుత కాలంలో కాస్టింగ్ కౌచ్ అనే అంశం ప్రతి రంగంలోనూ ఉందని అయితే ఈ కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొనే సమయంలో తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగులు లేకపోవడంతో నటి ప్రగతి తన ఆరోగ్య ఫిట్నెస్ పై శ్రద్ధ వహించింది.ఇందులో భాగంగా యోగా మరియు జిమ్ వర్క్ ఔట్లు వంటివి చేస్తూ బాగానే శ్రమిస్తోంది.

అలాగే పలు ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube