ఈ ఫేమస్ విలన్ భార్య ఎవరో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే...?

దర్శకధీరుడు రాజమౌళి సినిమాలలో ఎక్కువగా కనిపించే నటుల్లో చంద్రశేఖర్ ఒకరు.ఇచ్చిన ఏ పాత్రకైనా చంద్రశేఖర్ పూర్తి న్యాయం చేస్తాడు కాబట్టే రాజమౌళి తన సినిమాల్లో చంద్రశేఖర్ కు అవకాశాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు.

 Character Artist Chatrapati Chandrasekhar Wife Details, Neelya Bhavani, Chandras-TeluguStop.com

రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కూడా చంద్రశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది.అయితే ఆయన భార్య గురించి, వ్యక్తిగత జీవితం గురించి ప్రజలకు పెద్దగా తెలియదు.

చంద్రశేఖర్ స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు.సింహాద్రి, విక్రమార్కుడు సినిమాలలోని పాత్రలు చంద్రశేఖర్ కు మంచి పేరుతో పాటు గుర్తింపును కూడా తెచ్చిపెట్టాయి.

రాజమౌళితో పాటు ఇతర దర్శకుల సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస అవకాశాలతో బిజీ అయ్యారు.ఛత్రపతి చంద్రశేఖర్ భార్య కూడా మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తే కావడం గమనార్హం.

చంద్రశేఖర్ భార్య పేరు నీలియా భవాని.ఈమె తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మహిళ.

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక మునుపే చంద్రశేఖర్, భవాని ఒకరినొకరు ప్రేమించుకున్నారు.అనంతరం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత కెరీర్ లో స్థిరపడాలనే ఉద్దేశంతో చంద్రశేఖర్, భవానీ ఇద్దరూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యారు.

భవాని బుల్లి తెర సీరియల్స్ తో పాటు నాని జెంటిల్ మేన్, రామ్ పండగ చేస్కో తదితర సినిమాల్లో నటించింది.

అయితే వివిధ కారణాల వల్ల చంద్రశేఖర్, భవాని విడిపోయారు.వీళ్లకు ఒక పాప, బాబు.బాబు క్రికెటర్ గా స్థిరపడాలనే ఆలోచనతో ఉండగా పాప మెడిసిన్ చదువుతోంది.తెలుగుతో పాటు ఈమె తమిళంలోని స్టార్ హీరోల సినిమాల్లో సైతం నటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube