నన్ను.. నువ్వు పతివ్రతవా అని అడిగారంటూ ఎమోషనల్ అయిన తెలుగు నటి…  

Apoorva, Telugu character artist, casting couch incident, Tollywood - Telugu Apoorva, Casting Couch Incident, Telugu Character Artist, Tollywood

తెలుగులో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు నటి అపూర్వ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.ఈమె ఎక్కువగా అమ్మ, అక్క, వదిన, చెల్లెలు తదితర పాత్రలలో నటించి బాగానే ప్రేక్షకులను మెప్పించింది.

 Character Artist Apoorva Emotional About Casting Couch Incident

అంతేగాక కొంతమేర బోల్డ్ తరహా పాత్రలలో కూడా నటించింది. అయితే తాజాగా నటి అపూర్వ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొంది ఇందులో భాగంగా తన సినీ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు గురించి చెప్పుకొచ్చింది.

ఇందులో తాను సినీ హీరో శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ఓ చిత్ర షూటింగులో సినీ పరిశ్రమలో పేరున్న ఓ వ్యక్తి  తన దగ్గరికి వచ్చి కమిట్మెంట్ అడిగాడని కానీ తాను మాత్రం అందుకు నిర్మాణంగా నో అని చెప్పానని తెలిపింది.అంతేగాక ఈ విషయం గురించి సినిమా పరిశ్రమలో బాగా కావలసినటువంటి ఓ ప్రముఖ సీనియర్ నటుడితో చెబితే ఇంకోసారి ఇలాంటి కమిట్మెంట్లు ఎవరైనా అడిగితే చెప్పుతో కొడతా అని డైరెక్ట్ గా మొహం మీదే చెప్పేసేయ్ అని ధైర్యం చెప్పాడని తెలిపింది.

నన్ను.. నువ్వు పతివ్రతవా అని అడిగారంటూ ఎమోషనల్ అయిన తెలుగు నటి…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే అప్పట్లో తనకు హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చినటువంటి దర్శక నిర్మాతల దగ్గర షూటింగ్ సమయంలో డబ్బులు అయిపోవడంతో ఓ ఫైనాన్సియర్ దర్శకుల ద్వారా తనను కమిట్మెంట్ ఇస్తే డబ్బులు ఇస్తానని అడిగాడని అప్పుడు కూడా తాను నో చెప్పడంతో ఆ వ్యక్తి ఏకంగా నిన్ను సినిమా పరిశ్రమలో పతివ్రత అనుకుంటున్నారని అనుకుంటున్నావా.? నువ్వు చేసే పాత్రలు, సన్నివేశాలు గురించి ఒకసారి చూసుకో అంటూ కొంతమేర అసభ్యంగా మాట్లాడాడని చెప్పుకొచ్చింది.

దాంతో తాను ఆ చిత్రం నుంచి బయటకు వచ్చేశానని తెలిపింది.అలాగే తనకు ఇష్టం లేకుండా వ్యక్తిగత జీవితంలో గానీ,  సిని జీవితంలో గానీ, ఎలాంటి పని చేయనని చెప్పుకొచ్చింది.

తాను కొంతమేర బోల్డ్ తరహా పాత్రలలో నటించిన మాట వాస్తవమే కానీ ఎక్కువ మంది తన నటన కంటే తననే ఎక్కువగా చూస్తున్నారని అందువల్లే తన పాత్ర బోల్డ్ తరహాలో ఉంటుందని అనుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది.

#Apoorva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Character Artist Apoorva Emotional About Casting Couch Incident Related Telugu News,Photos/Pics,Images..