ఎక్స్ పోజింగ్ చేస్తే సినిమా ఆఫర్లు వస్తాయనుకోవడం భ్రమ...

భారతదేశం లో టిక్ టాక్ యాప్ ద్వారా వైరల్ అయ్యి తమలో ఉన్నటువంటి టాలెంట్ నిరూపించుకుని సినిమా అవకాశాలు దక్కించుకున్న నూతన నటీనటులు చాలా మంది ఉన్నారు.ఈ క్రమంలో కొందరు ప్రతిభ ఉంటే సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ అవసరం లేదని నిరూపించారు.

 Character Artist Anupama Swathi About Casting Couch In Film Industry-TeluguStop.com

కాగా ఆ మధ్య పలు టిక్ టాక్ వీడియోల ద్వారా ప్రేక్షకులను బాగానే అలరించినటువంటి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “అనుపమ స్వాతి” కూడా ఈ కోవకే చెందుతుంది.కాగా తాజాగా అనుపమ స్వాతి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పాల్గొని సినిమా ఇండస్ట్రీలో ఉన్న “క్యాస్టింగ్ కౌచ్” విషయం పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసే యాంకర్ మీకు సినిమా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురయ్యాయా.? అలాగే ఇప్పటివరకు మీరు పలాస 1978 చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించారని అంతేకాకుండా మీ టిక్ టాక్ వీడియోలలో కూడా కొంతమేర ఎక్స్ పోజింగ్ చేస్తూ నటించారని దాంతో సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా పడక గది కమిట్మెంట్ అడగడం వంటివి చేసారా.? అంటూ అనుపమ స్వాతి నిప్రశ్నించాడు.దీంతో అనుపమ స్వాతి ఈ విషయంపై స్పందిస్తూ ఇప్పటివరకు తనకు తానుగా సినిమా అవకాశాల కోసం ఏ దర్శకుడి దగ్గరికి వెళ్లలేదని కానీ ఎవరైనా సరే అవకాశం ఇస్తామని వస్తే ఖచ్చితంగా తన పాత్రకి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చింది.

 Character Artist Anupama Swathi About Casting Couch In Film Industry-ఎక్స్ పోజింగ్ చేస్తే సినిమా ఆఫర్లు వస్తాయనుకోవడం భ్రమ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో తాను ఎలాంటి కమిట్మెంట్ సమస్యలను ఎదుర్కో లేదని కూడా స్పష్టం చేసింది.అలాగే తాను పలాస చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించడంతో పాటు యంగ్ హీరో నందు హీరోగా నటించిన “సవారి” చిత్రంలో కూడా హీరోయిన్ పిన్ని పాత్రలో నటించానని ఈ క్యారెక్టర్ కొంతమేర నెగిటివ్ షేడ్స్ తరహాలో ఉంటుందని అయితే సవారీ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడి ఆఫీస్ ఎక్కడుందో ఇప్పటివరకు తనకి తెలియదని కేవలం తన ఫేస్ బుక్ ద్వారా దర్శకుడు సంప్రదించాడని దాంతో తాను కూడా దర్శకుడు ని నమ్మి ఆ చిత్రంలో నటించానని చెప్పుకొచ్చింది.

Telugu Anupama Swathi, Casting Couch, Character Artist, Character Artist Anupama Swathi About Casting Couch In Film Industry, Film Industry, Tollywood-Movie

అలాగే సోషల్ మీడియా మాధ్యమాలలో తాను బాగా యాక్టివ్ గా ఉంటానని అందువల్లనే కొందరు దర్శక నిర్మాతలు తన ఫోటోలు మరియు వీడియోలను చూసి సినిమా అవకాశాలను ఆఫర్ చేశారని దాంతో తాను ఎప్పుడూ కూడా క్యాస్టింగ్ కౌచ్ భారిన పడలేదని క్లారిటీ ఇచ్చింది.కాగా ఇటీవలే తాను “స్పేస్ మామ్స్” అనే చిత్రంలో కూడా ద్విపాత్రాభినయం చేశారని ఇందులో 30 ఏళ్ల యువతి మరియు 60 ఏళ్ల బామ్మ పాత్రలో నటించానని అయితే కొంతమంది దర్శక నిర్మాతలు కేవలం ఎక్స్ పోజింగ్ మాత్రమే చూడరని తమలో ఉన్నటువంటి నటనా ప్రతిభ కూడా చూస్తారని అందువల్లనే తనకు సంబంధించిన చిత్రాలు కనీసం విడుదల కాకపోయినప్పటికీ ద్వి పాత్రాభినయం చేసే అవకాశం ఇచ్చారని పేర్కొంది.అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ఎక్స్ పోజింగ్ చేస్తే అవకాశాలు వస్తాయనేది భ్రమ అని ప్రతిభ ఉంటే కచ్చితంగా అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయని ఆ విషయాన్ని తాను నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చింది.

#CharacterArtist #Anupama Swathi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు