మెగాస్టార్ మూవీ కథతో దిగుతున్న మాస్ రాజా  

Raviteja Next Movie Inspired By Chantabbayi, Raviteja, Krack, Chantabbayi, Nakkina Trinadha Rao, Tollywood News - Telugu Chantabbayi, Krack, Nakkina Trinadha Rao, Raviteja, Tollywood News

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

 Chantabbayi Raviteja Krack

అయితే ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు ఈ హీరో.

ఇప్పటికే దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించే సినిమాను ఓకే చేశాడు.

మెగాస్టార్ మూవీ కథతో దిగుతున్న మాస్ రాజా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమా కథ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సూపర్ హిట్ మూవీని పోలి ఉండటంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయి చిత్ర వర్గాలు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘చంటబ్బాయి’ చిత్రం ఆయన కెరీర్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా అదిరిపోయే హిట్ అందుకుంది.జంధ్యాల తెరకెక్కించిన ఈ సినిమాలో చిరు తన పర్ఫా్ర్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు.

ఇప్పుడు ఇలాంటి సజ్జెక్టుతోనే నక్కిన త్రినాథరావు ఓ కథను రెడీ చేసి రవితేజతో తెరకెక్కించాలని చూస్తున్నాడు.

తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించడంలో రవితేజ తనదైన మార్క్ వేసుకున్నాడు.

గతంలో ‘కిక్’ సినిమాతో ప్రేక్షకులకు ఎలాంటి కామెడీని పంచాడో అందరికీ తెలిసిందే.కానీ ఆ సినిమా తరువాత అంతటి కామెడీ టైమింగ్ ఉన్న సినిమాను రవితేజ చేయలేదని చెప్పాలి.

కిక్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ కూడా రవితేజ ఖాతా పడలేదు.దీంతో ఈ సినిమాతో అలాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకునేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.

మరి చంటబ్బాయి లాంటి కథతో వస్తున్న రవితేజ, అలాంటి విజయాన్ని అందుకుంటాడా లేడా అనేది చూడాలి.

#Raviteja #Krack #Chantabbayi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chantabbayi Raviteja Krack Related Telugu News,Photos/Pics,Images..