పార్టీ మారే ఆలోచన లేదంటూ స్పష్టం చేసిన జేడీ  

Jd Lakshmi Narayana Made It Clear On Intention Of Changing Party-janasena,jd Lakshmi Narayana,pawan Kalyan,tdp,ys Jagan,ysrcp

ఎన్నికల ముందు వరకు చాలా యాక్టీవ్ గా పార్టిసిపేట్ చేసిన జనసేన నేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం ఆ పార్టీ తో అంటీముట్టనట్లు ఉంటున్న సంగతి తెలిసిందే.అయితే ఆయన వ్యవహార తీరుపై అందరూ కూడా ఆయన పార్టీ మారె ఆలోచనలో ఉన్నారు అంటూ తెగ ప్రచారం కూడా జరుగుతుంది.

Jd Lakshmi Narayana Made It Clear On Intention Of Changing Party-janasena,jd Lakshmi Narayana,pawan Kalyan,tdp,ys Jagan,ysrcp Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-JD Lakshmi Narayana Made It Clear On Intention Of Changing Party-Janasena Jd Pawan Kalyan Tdp Ys Jagan Ysrcp

అందుకే ఆయన జనసేన పార్టీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదంటూ రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.అయితే ఆయన ఈ వ్యాఖ్యలపై మరో సారి స్పష్టమైన వివరణ ఇచ్చారు.

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవి వట్టి గాలి వార్తలే అంటూ కొట్టిపడేశారు.పార్టీ నిర్ణయాల ప్రకారమే తాను నడుచుకుంటున్నట్లు తెలిపారు.అయితే 2020లో తాను కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నానని, వాటి కోసం అధిక సమయం వెచ్చిస్తానని చెప్పారు.అదే సమయంలో పార్టీ అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తానని ఆయన అన్నారు.

అంతేకాకుండా ఒక వేళ నేను గనుక పార్టీ మారే ఆలోచన గనుక ఉంటే మాత్రం తప్పకుండా ముందే చెప్పి మారిపోతానంటూ స్పష్టత ఇచ్చారు.అసలు ప్రస్తుతం తాను పార్టీ మారబోనని,అలాంటి ఆలోచన ప్రస్తుతానికి లేదంటూ స్పష్టంగా తెలిపారు.

నిత్యం ప్రజల్లో ఉంటున్నానని, ప్రజా చైతన్య కార్యక్రమాలకు హాజరవుతూ ఫుల్ బిజీగా ఉన్నట్లుగా లక్ష్మీనారాయణ చెప్పారు.

తాజా వార్తలు

Jd Lakshmi Narayana Made It Clear On Intention Of Changing Party-janasena,jd Lakshmi Narayana,pawan Kalyan,tdp,ys Jagan,ysrcp Related....