ఎన్టీఆర్ కోసం భారీ ప్లాన్ చేస్తోన్న డైరెక్టర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా, ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 Changes In Script For Ntr Koratala Movie-TeluguStop.com

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ చిత్రాన్ని ఇటీవల అనౌన్స్ చేశాడు.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో తారక్ 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

 Changes In Script For Ntr Koratala Movie-ఎన్టీఆర్ కోసం భారీ ప్లాన్ చేస్తోన్న డైరెక్టర్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.దీంతో ఇప్పుడు మరోసారి తారక్‌తో కలిసి చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్టును కూడా పర్ఫెక్ట్‌గా ఉండేలా కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.

కాగా ఇప్పటికే ఈ స్క్రిప్టును పూర్తి చేసిన ఆయన, ఇప్పుడు అందులో పలు మార్పులు చేస్తున్నాడట.ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో ఉండేలా కథలో మార్పులు చేస్తున్నాడట కొరటాల.

దీంతో తారక్-కొరటాల కాంబోలో రాబోయే సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ కానుందని అభిమానులు సంతోషిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఓ స్టూడెంట్ లీడర్‌గా తారక్‌ను చాలా పవర్‌ఫుల్‌గా చూపించనున్నాడట కొరటాల.

దీనికి తోడు యూనివర్సల్ సబ్జెక్టు కావడంతో ఈ సినిమాతో తారక్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.అతి త్వరలో ఈ సినిమాను పట్టాలెక్కించి 2022 సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరి ఈ సినిమా ఎలాంటి కథతో వచ్చి ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయం కూడా తెలియాల్సి ఉంది.

#NTR30 #Koratala Siva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు