కేంద్రంలో మార్పులు జరుగుతాయా?  

Changes In Central Cabinet?-

దేశంలో ఒక పక్క ఎన్నికల ఫలితాలు వస్తున్న దశలోనే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకపోయినా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతున్నదో తెలిసిపోయింది.కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి శర్వానంద్ సొనొవాల్ అస్సాం ముఖ్యమంత్రిగా వెళతారని ప్రచారం జరుగుతోంది..

Changes In Central Cabinet?---

ఈయనను అస్సాం ముఖ్యమంత్రిగా ముందే ప్రకటించారు కాబట్టి ఆయన అస్సాంకు వెళతారని అనుకుంటున్నారు.ఆయన వెళితే ఆ పదవి భర్తీ చేయాల్సి ఉంటుంది. జేపీ నద్దా, ప్రకాష్ జవదేకర్, గిరిరాజ్ సింగును పదవుల నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఆర్ధికపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ మంత్రి సుజనా చౌదరిని కూడా తొలగిస్తారని తెలుస్తోంది.మొత్తం ఆరుగురిని తీసివేస్తారని భావిస్తున్నారు.