"ఆంధ్ర"రాజధాని అక్కడ కాదంట!

అనేకానేక కసరత్తులు చేసి ఎందరో సలహాలు, సూచనలు తీసుకున్న తరువాత ఎట్టకేలకు ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా “తుళ్ళూరు”ను ఎంపిక చేసింది ప్రభుత్వం.అయితే ఇక దీనినే ఆధారంగా చేసుకుని ఒకపక్క చంద్ర బాబు తన చాణక్యతతో అటు సింగపూర్, జపాన్ దేశాలు తిరిగి రాజధాని నిర్మాణంలో సహకరించాలంటూ ఒప్పందాలు సైతం చేసుకున్నారు.

 Change In Ap Capital Plan??-TeluguStop.com

ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చలు చూస్తుంటే రాజధానికి తుళ్ళూరు సరైన ప్రాంతం కాదు అన్న వాదన బలంగా వినిపిస్తుంది.విషయం ఏమిటంటే కేంద్ర సంస్థల నుంచి వచ్చిన ఒక నివేదిక ప్రకారం కృష్ణా నదీ తీర ప్రాంతంలో ఉన్న ఒండ్రు మట్టి నెలలు భారీ భవనాల నిర్మాణాలకు అనుకూలం కాదని తేలడంతో ప్రభుత్వం మరో మారు రాజధాని విషయంపై మనసు మార్చుకోనుంది అన్న వాదన వినిపిస్తుంది.

అయితే ఇదే నిజమైతే మాత్రం రాజధాని అవకాశం తుళ్ళూరు వదిలి భూసారం బలంగా ఉన్న దొనకొండ, లేదా నూజివీడు ప్రాంతాలకు తరలిపోయే అవకాశం ఉంది అని ప్రభుత్వ వర్గాల్లో భారీగా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇవన్ని పుకార్లు అని, మరో మారు రాజధాని విషయంపై సందిగ్ధత అవసరం లేదు అని సైతం మరి కొందరి వాదన.

ఏది ఏమైనా, రాజధాని ఎక్కడ ఏర్పాటైనా అటు కృష్ణా, ఇటు గుంటూర్ జిల్లాలను మాత్రం వదిలి పోదు అని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube