బాబు క్యాబినెట్లో సగంమంది ఓడిపోతారా ...?       2018-06-26   22:09:03  IST  Bhanu C

ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్దంగానే ఉన్నామని మళ్ళీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది మేమే అంటూ గొప్పలు చెప్పుకుంటూ సంకలు గుద్దుకుంటున్న టీడీపీకి ఇప్పుడు ఓ భయం పట్టుకుంది. రాష్ట్ర క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న చాలామంది ప్రజా వ్యతికేత ఎదుర్కుంటున్నారని, ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారిని ఓడించేందుకు చూస్తున్నారని వార్తలు వినిపిస్తుండడంతో వారిలో ఆందోళన మొదలయ్యింది. సాధారణంగానే.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ చాలా మంది మంత్రులు ఓటమి పాలవుతూ ఉంటారు.

బాబు కేబినెట్లో మంత్రులుగా ఉన్న చాలా మంది ఎదురుదీతున్నారని.. వీరిలో సగం మంది వచ్చేసారి ఓటమి పాలయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తుండడంతో చంద్రబాబు లో కూడా ఆందోళన మొదలయ్యింది. ముఖ్యంగా మంత్రులు కళా వెంకట్రావు, అయ్యనపాత్రుడు, చిన్నరాజప్ప, పితాని, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి, శిద్ధా, భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, కేఈలు.. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని వివిధ సర్వేలు తేల్చి చెప్పాయి.

అలేగే మిగతా మంత్రులు దేవినేని ఉమా , అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్, అమర్‌నాథ్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, కేఎస్ జవహర్‌ల పరిస్థితి ఏమిటి? అంటే.. వీరి నియోజకవర్గాల్లో కూడా హోరాహోరీ తప్పదు అని సమాచారం. కచ్చితంగా ఓటమి తప్పదు అనే పై మంత్రుల కన్నా.. వీరి పరిస్థితి కాస్తో కూస్తో బెటర్ అని సమాచారం. ఇక గంటా శ్రీనివాసరావు గెలిచే అవకాశం లేదని టీడీపీకి సంబంధించిన కొన్ని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. ఇంకా ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉన్నందున అప్పటికి వారు వారి వారి నియోజకవర్గాల్లో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల మనసులు గెలుచుకుంటే తప్ప పరిస్థితుల్లో మార్పు అయితే వచ్చే అవకాశమే లేనట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.