'అదే నివేదిక' ఇచ్చే దమ్ముందా బాబు..??   Chandrbabu And Lokesh Comments On Jagan Attack     2018-10-28   11:45:14  IST  Sainath G

జగన్ పై జరిగిన దాడి ఘటనకి పూర్తి భాధ్యతని ఏపీ ప్రభుత్వం భాద్యత వహించవలసిన అవసరం తప్పని సరిగా ఉంది..కానీ టీడీపీ ప్రభుత్వం ఈ ఘటనని కేంద్రం మీదకి నెట్టేసి సైలెంట్ గా తప్పించుకుందామని అనుకుంటోంది. అంతేనా మరొక అడుగు ముందుకు వేసి ఏకంగా జగనే కావాలని పొడిపించుకుని సానుభూతి పొందటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ తన దిగజారుడు స్వభావాన్ని బయటపెట్టుకుంది.ఇక తండ్రిగారి అడుగుజాడల్లో నడుస్తున్న లోకేష్ బాబు ట్విట్టర్ లో జగన్ కావాలని తనపై దాడి చేయించుకున్నాడు అంటూ మరో సారి తన బిరుదుకి సార్ధకత చేర్చుకున్నాడు..అయితే

ఇదంతా ఓ పెద్ద డ్రామా మాకు తెలుసు అంటున్న ముఖ్యమంత్రి తనకి ఉన్న అధికారంతో ఒక వేళ అదే జరిగి ఉంటే అలాంటి నివేదిక తయారు చేయవచ్చు కదా..?? నిజంగానే టీడీపీ వాళ్ళు అన్నట్టుగా జగన్ తనపై దాడి చేయించుకుని ఉంటే.. తెలుగుదేశం పార్టీకి జగన్ ని ఇరికించడానికి ఇంతకన్నా గొప్ప అవకాశం లేదనే చెప్పాలి.. ఈ విషయాన్ని పూర్తి ఆధారాలతో చూపించేసి వైసీపీ అధినేతను పూర్తిగా ఇరకాటంలో పెట్టొచ్చు..మరీ ఆరోపణలు చేస్తున్నారు తప్ప అసలు నిజం బయట పెట్టచ్చు కదా..??

Chandrbabu And Lokesh Comments On Jagan Attack-

ముఖ్య మంత్రి మొదలు, తనయుడు లోకేష్ వరకూ చోటా మోట నేతలు అందరూ జగన్ పై కారు కూతలు కూస్తున్నారు కాని ఆ కుట్ర కోణం ఏమిటో మాత్రం చెప్పడం లేదు. ఒకవేళ జగన్ ఇలాంటి పని చేయించుకుని ఉంటే.. తెలుగుదేశం పార్టీ లౌడ్ స్పీకర్స్ కానీ లేదా సాక్షాత్తు ముఖ్యమంత్రి కాని ఇలా చేతులు ముడుచుకుని కూర్చోరు కదా…ఎందుకు కాలయాపన జరిగే రాద్దంతాలు.. చేస్తున్నారు? అధికారం చేతిలో ఉంచుకుని ఎందుకు బాబు ఇంతటి తర్జన బర్జన పడుతున్నారు..?? అసలు అంశాన్ని వదిలేసి చంద్రబాబు గవర్నర్ గిరీ పై మాట్లాడటం ఎంతో హాస్యాస్పదం అవుతోంది..చంద్రబాబు అనుభవం ఈ విషయంలో చట్టుబండలయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు విశ్లేషకులు.