ప‌థ‌కాల‌పై సంతృప్తి ఎవ‌రికి.. బాబుకా.. ప్ర‌జ‌ల‌కా..?

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ వేదిక ఎక్కినా చెబుతున్న ఏకైక మాట‌.ప్ర‌జ‌లు ఎంతో సంతృప్తితో ఉన్నార‌ని! తాను ప్ర‌వేశ పెడుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లు ఇప్ప‌టికే దాదాపు 80% సంతృప్తితో ఉన్నార‌ని ఆయ‌న అంటున్నారు.

 Chandrbabi Ap Govt Schemes-TeluguStop.com

ఈ విష‌యాన్ని అటు వీడియో కాన్ఫ‌రెన్సులు, స‌ద‌స్సులు, బ‌హిరంగ స‌మావేశాల్లోనూ ఆయ‌న చెబుతున్నారు.మ‌రి సంతృప్తి ఈ రేంజ్‌లో ఉంటే.

అటు వైసీపీ అధినేత జ‌గ‌న్ కానీ, జ‌న‌సేనాని ప‌వ‌న్ కానీ పెడుతున్న స‌భ‌ల‌కు, నిర్వ‌హిస్తునన్న స‌మావేశాల‌కు ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఎందుకు వెళ్తున్నారు? వారు త‌మ క‌ష్టాల‌ను ఎందుకు వెళ్ల‌బోసుకుంటున్నారు? త‌మకు ప్ర‌భుత్వం నుంచి క‌నీస సౌక‌ర్యాలు కూడా అంద‌డం లేద‌ని క‌న్నీటి ప‌ర్యంతం ఎందుకు అవుతున్నారు? ఇలాంటి అనేక ప్రశ్న‌ల‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నేవి ప‌రిశీల‌కుల మాట‌.

రాష్ట్రంలో అధికారం చేప‌ట్టిన త‌ర్వాత గ‌తంలో లేని విధంగా చంద్ర‌బాబు.ప్ర‌తి విష‌యంలోనూ స‌ర్వేల‌నే న‌మ్ముతున్నారు.త‌న సొంత పార్టీ టీడీపీలో నేత‌ల ప‌రిస్థితి నుంచి ఎమ్మెల్యేలు, అధికారుల ప‌నితీరు,ప్ర‌జ‌ల సంతృప్తి వంటి కీల‌క విష‌యాల‌ను కూడా ఆయ‌న స‌ర్వేల ద్వారానే తెలుసుకుంటు న్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న సంక్షేమ ప‌థ‌కాల ద్వారా రాష్ట్రంలో 80% మంది ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నార‌ని, ఇది దేశంలోనే తొలి ప్లేస్ అని అధికారులు వెల్ల‌డించారు.దీనిని చంద్ర‌బాబు స్వ‌యంగా ప‌లు స‌భ‌ల్లో వెల్ల‌డించారు.

నిజానికి ఇప్ప‌టికీ త‌మ కు పింఛ‌న్ అంద‌లేద‌ని చెబుతున్న అనేక మంది వృద్ధులు, వితంతువులు రాజ‌ధాని న‌గ‌రం విజ‌య‌వాడ‌, గుంటూరుల్లోనే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.అది కూడా ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌ల్లో ప్ర‌త్యేక క‌థ‌నాలు గా వ‌చ్చాయి.

అదేవిధంగా ఈపోస్ యంత్రాల‌తో తిప్ప‌లు ప‌డుతున్నామ‌ని, స‌రుకులు స‌రిగా అంద‌డం లేద‌ని చెబుతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి.

అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు మాన‌స పుత్రిక జ‌న్మ‌భూమి క‌మిటీల‌పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్న విష‌యం కొత్త‌కాదు.

ఏకంగా.ఏరాష్ట్రంలోనూ లేని విధంగా చంద్ర‌బాబు త‌న ప్ర‌భుత్వంలో అవినీతి పెరిగిపోయింద‌ని గుర్తించి అధికారుల‌ను, సిబ్బందిని పైకి ఏమీ అన‌లేక అవినీతికి పాల్ప‌డిన వారిని ప‌ట్టించండ‌ని ప్ర‌జ‌లకే 1100 నెంబ‌రును అందించారు.

పోనీ.దీనికి పోన్ చేసినా.

స‌ద‌రు సిబ్బంది రికార్డు చేసుకుంటున్న కేసులు రోజుల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ప‌డిపోతున్నాయి.నిజానికి రోగం రాకుండా చూడ‌డం పోయి.

రోగం వ‌చ్చాక మందు ఇస్తున్న‌ట్టు ఇలా అవినీతి గురించి అలెర్ట్ చేయ‌మ‌ని నెంబ‌ర్ ఇవ్వ‌డం ప్ర‌జ‌ల్లో విస్మ‌యం క‌లిగిస్తున్న విష‌యం.అదేవిధంగా ప్ర‌భుత్వం ఆస్ప‌త్రుల ప‌రిస్థితి మ‌రింత‌గా దిగ‌జారుతోంది.

రోజుకో వార్త ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.ఇప్ప‌టికీ రిమోట్ ప్రాంతాల్లో వైద్యం అంద‌డం గ‌గ‌నంగా మారిపోయింది.ఎన్టీఆర్ ఇళ్ల కేటాయింపులోనూ చేతివాటం భారీ ఎత్తున పెరిగిపోయింద‌ని ప‌త్రిక‌లు ఘోషిస్తున్నాయి.మ‌రి ఇంత జ‌రుగుతుంటే.

ప్ర‌జ‌ల్లో సంతృప్తి ఎలా ఎక్క‌డ నుంచి వెలుగు చూస్తోందో.చంద్ర‌బాబు గ్ర‌హించాలి.

సీఎం మెప్పుకోసం.కొంద‌రు అధికారులు ఇలా సంతృప్త‌స్థాయి పేరుతో అంకెల గార‌డీ చేస్తున్నార‌న్న వ్యాఖ్య‌లు సైతం వినిపిస్తున్నాయి.

మొత్తంగా ఈ సంతృప్తి బాబుకే త‌ప్ప‌.ప్ర‌జ‌ల‌కు కాద‌నేది నిష్టు ర స‌త్యం!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube