ప్రభాస్ ఓకే అంటే చాలు ఎన్ని సంవత్సరాలైనా వేచి చూస్తానంటున్న డైరెక్టర్..!

బాహుబలి చిత్రంతో తన స్టామినాను ఒక్కసారిగా పెంచుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.ప్రస్తుతం ప్రభాస్ వరస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తు బిజీగా ఉన్నాడు.

 Chandrasekhar Yeleti Ready To Script For Prabhas-TeluguStop.com

దాదాపు ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇంకా దర్శకులు ప్రభాస్ వెంట పడుతూనే ఉన్నారు.కథ చెప్పి ఓకే చెప్పించుకున్న ఇప్పట్లో ప్రభాస్ తో సినిమా అంటే కష్టమే.

ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో పాటు మరొక రెండు సినిమాల షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసాడు.రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.

 Chandrasekhar Yeleti Ready To Script For Prabhas-ప్రభాస్ ఓకే అంటే చాలు ఎన్ని సంవత్సరాలైనా వేచి చూస్తానంటున్న డైరెక్టర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో పాటు సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.సలార్ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.

ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.

Telugu #salaar, Adipurush, Chadrasekhar Yeleti And Prabhas, Chandrasekhar Yeleti, Chandrasekhar Yeleti Ready To Script For Prabhas, Om Rout, Pan India Movies, Prabhas, Prabhas Movies, Prashanth Neel, Radheshyam, Script Work, Shruti Haasan-Movie

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.

వీటి తర్వాత సిద్దార్థ్ ఆనంద్ కూడా లైన్లో ఉన్నాడు.అయితే ప్రభాస్ చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నా ప్రభాస్ వెంట డైరెక్టర్లు క్యూ కడుతున్నారు.తాజాగా మరొక దర్శకుడు ప్రభాస్ కు కథ వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాక్ నడుస్తుంది.

చంద్రశేఖర్ ఏలేటి కూడా ప్రభాస్ కోసం జాతీయ స్థాయిలో వర్క్ అవుట్ అయ్యే విధంగా ఒక కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట.

కథ సిద్ధం అవ్వగానే ప్రభాస్ కు కథ వినిపించి ఓకే చెప్పించుకునే పనిలో ఉందనున్నట్టు సమాచారం.ప్రభాస్ కనుక ఓకే అంటే ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

#Om Rout ##Salaar #Prashanth Neel #Script Work #Prabhas Movies

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు