ఏలేటి-మైత్రీ బంధానికి చెక్ పడినట్లేనా

తెలుగులో మంచి టాలెంటెడ్ దర్శకుడుగా చంద్రశేఖర్ ఏలేటికి ఒక గుర్తింపు ఉంది.బలమైన కథ, కథనాల ఆధారంగా కమర్షియల్ హంగులకి దూరంగా అతను సినిమాలు చేస్తూ ఉంటాడు.

 Chandrasekhar Yeleti And Mythri Combination Breakdown-TeluguStop.com

ఈ నేపధ్యంలో చంద్రశేఖర్ ఏలేటి సినిమాలు థియేటర్ లో కంటే టెలివిజన్ పై ఎక్కువగా ప్రేక్షకులకి రీచ్ అవుతూ ఉంటాయి.తాజాగా చంద్రశేఖర్ ఏలేటి నితిన్ తో చెక్ సినిమా చేశాడు.

ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమాలో ఉరిశిక్ష పడ్డ ఖైదీగా నితిన్ నటించాడు.

 Chandrasekhar Yeleti And Mythri Combination Breakdown-ఏలేటి-మైత్రీ బంధానికి చెక్ పడినట్లేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా కథ, కథనాలు భాగానే నడిపించిన ఎందుకనో సినిమాకి మొదటి షో నుంచి డివైడ్ టాక్ వచ్చింది.మొదటి రోజు ఓ మోస్తారుగా కలెక్షన్ వచ్చిన తరువాత మాత్రం ప్రేక్షకులు లేక పూర్తిగా డల్ అయిపొయింది.

దీంతో ఈ సినిమాకి బ్రేక్ ఎవెన్ కూడా రాలేదు.

ఫైనల్ కలెక్షన్ పరంగా చూసుకుంటే చెక్ సినిమా నితిన్ కెరియర్ లో భారీ డిజాస్టర్ గా మిగిలిపోయిందని చెప్పాలి.

ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన నిర్మాత భవ్య ఆనంద్ ప్రసాద్ కి ఈ సినిమా నష్టాలే మిగిల్చింది.ఇదిలా ఉంటే చంద్రశేఖర్ ఏలేటి మనమంతా సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేశారు.

అయినా ఫ్లాప్ తప్పలేదు.ఇక చంద్రశేఖర్ తో మైత్రీ మూవీ మేకర్స్ వరకు ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేశారు.

చెక్ సినిమా ఫ్లాప్ కారణంగా ఇప్పుడు వారి కాంబోలో తెరకెక్కాల్సిన సినిమాకి బ్రేక్ పడినట్లు అయ్యింది.మరి ఈ టాలెంటెడ్ దర్శకుడు కెపాసిటీని నమ్మి మైత్రీ వారు ముందుకోస్తారా లేక కొంతకాలం హోల్డ్ లో పెడతారా అనేది వేచి చూడాలి.

#Mythri #Breakdown #Nithiin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు