చంద్రముఖి సీక్వెల్... రజినీకాంత్ పాత్రలో లారెన్స్

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన సినిమా చంద్రముఖి.మలయాళం సూపర్ హిట్ మూవీ ఆప్తమిత్రకి రీమేక్ గా దీనిని తెరకెక్కించారు.

 Chandramukhi Sequel Going On Sets In Kollywood-TeluguStop.com

ఇందులో రజినీకాంత్ సైకాలజీ డాక్టర్ గా నటించారు.ఇక ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

ఇక ఇందులో జ్యోతిక సీక్వెన్స్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.దీనికి సీక్వెల్ గా పి వాసు దర్శకత్వంలో తెలుగులో నాగవల్లి అనే సినిమాని వెంకటేష్ హీరోగా తీసారు.

 Chandramukhi Sequel Going On Sets In Kollywood-చంద్రముఖి సీక్వెల్… రజినీకాంత్ పాత్రలో లారెన్స్-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తెలుగులో ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.అచ్చం చంద్రముఖి తరహాలోనే కథ, కథనం ఉండటంతో తెలుగులో ఫ్లాప్ అయ్యింది.

అయితే ఇప్పుడు చంద్రముఖికి తమిళంలో సీక్వెల్ కథని దర్శకుడు పి వాసు సిద్ధం చేశారు.దీనిని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు.

దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ రూపొందనున్నది.ఈ సీక్వెల్‌లో రజినీకాంత్ చేసిన పాత్రలో లారెన్స్‌ హీరోగా నటించనున్నాడు.ఈ విషయాన్ని లారెన్స్‌ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.ఆయన తన సోషల్ మీడియాలో రాస్తూ రజనీకాంత్‌ అనుమతి, ఆశీర్వాదంతోనే ఈ సీక్వెల్‌ను మొదలుపెట్టనున్నాం.

ఇంత గొప్ప సినిమాలో భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను.ఈ సీక్వెల్‌కు పి.వాసు దర్శకత్వం వహించనున్నారు.సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు’ అని లారెన్స్‌ తెలిపాడు.

మరి తెలుగులో ఫ్లాప్ అయిన చంద్రముఖి సీక్వెల్ తమిళంలో ఎంత వరకు హిట్ అవుతుంది అనేది చూడాలి.

#Rajinikanth #Lawrence

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు