మోడీ కి దిమ్మతిరిగేలా చంద్రబాబు తాజా వ్యూహాలు       2018-05-03   01:32:02  IST  Bhanu C

కేంద్రం పై ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాటానికి అనూహ్యమైన స్పందన వస్తోంది..ఒక పక్క కేంద్రంతో డీ అంటే డీ అంటూనే మరో వైపు ఏపీ రాజకీయాలలో భవిష్యత్తు వ్యుహలపై కసరత్తులు చేస్తున్నారు అయితే ఏపీలో ఏపీలో ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా సరే కేంద్రంలో మోడీ కి మాత్రం దిమ్మ తిరిగిపోయేలా చంద్రబాబు వ్యుహాలు సిద్దంగా ఉన్నాయని అంటున్నారు టీడీపి నేతలు..నెల రోజుల పార్లమెంటు అడ్డగింత తర్వాత ఢిల్లీలో ప్రధాని నివాసం ముట్టడి తరవాత… అనూహ్యంగా చంద్రబాబు తన పుట్టినరోజు న విజయవాడలో దీక్ష చేపట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు..

అయితే ఇదే సమయంలో ఏపీ ప్రజలకి చంద్రబాబు పై మరింత నమ్మకం పెరిగింది..ఏపీకి ప్రత్యేక హోదా రావాలన్నా..కేంద్రం మెడలు వంచి తీసుకు రావాలన్నా సరే దానికి చంద్రబాబే సరైన వ్యక్తని..తెలుగుదేశం పార్టీ ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుందని ఫిక్స్ అయ్యారు..అయితే ప్రత్యేక ఉద్యమం నేను మొదలు పెట్టాను అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి, నేను ముందుకు తీసుకు వెళ్లాను అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మధ్యలోనే మోడీకి లొంగిపోవడంతో..ఆ భారం మొత్తం చంద్రబాబు పైనే పడింది..

దాంతో చంద్రబాబు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న వ్యూహాలతో మోడీ కి దిమ్మతిరిగి పోతూ వస్తోంది..ఈ క్రమంలోనే టీడీపీ పోరాటాలకు వస్తున్న జనాదరణ… పెరుగుతున్న పార్టీ బలం నేపథ్యంలో మరింత దూకుడుగా కేంద్రంపై పోరాడాలని ఆ పోరాటాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం విజయవాడలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విజయవాడలో మహానాడు జరుపుకోవడంతోపాటు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల సాధనే లక్ష్యంగా అన్ని జిల్లాల్లో ధర్మపోరాట సభలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.

ఏపీ హక్కులు, అభివృద్ధి కోసం చేస్తున్న పోరాటంతో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత పెరిగిందని..అందుకు నిదర్సనమే తిరుపతి ధర్మపోరాట సభ విజయవంతం అవదామని అన్నారు..అయితే బీజేపి పెద్దలు మోడీ,అమిత్ షా లకి ఈ సారి ఇవ్వబోయే స్ట్రోక్ భారీగా ఉండాలని ప్లాన్ చేసిన చంద్రబు నాయుడు..మరో కొత్త వ్యూహాన్ని సిద్దం చేశారు..బీజేపీ నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై రాష్ట్రంలో మరో 12 సభలు నిర్వహించాలని చివరి సభని అమరావతిలో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.. నిర్ణియించారు..వీటిలో చివరి సభని చివరి సభ అమరావతిలో నిర్వహించనున్నారు…అంతేకాదు ప్రతీ జిల్లాలో ధర్మ పోరాట సభలు జరుగుతాయని కళా వెంకట్రావు తెలిపారు.

అయితే వచ్చే ఏడాది మార్చి తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో. ప్రజల్లో ఉన్న ఇదే ఆవేశాన్ని… పార్టీలో అప్పటి వరకు కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.. 12 సభలు జరపడం అంటే వచ్చే ఎన్నికలు వరకు టీడీపీ ప్రజలలో నిత్యం ఉంటుంది అదేసమయంలో మోడీ పై ఏపీ ప్రజలకి రోజు రోజు కి మరింత కోపం పెరిగిపోతుంది దాంతో ఏకకాలంలో అటు మోడీ ని దెబ్బకోడుతూ టీడీపికి మైలేజ్ తీసుకు వచ్చేలా చంద్రబాబు పక్క ప్లాన్ సిద్ధంగా ఉందని అంటున్నారు టీడీపి నేతలు..అయితే ఇదే గనుకా చివరి వరకూ కొనసాగితే చంద్రబాబు మళ్ళీ ఏపీలో చక్రం తిప్పడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.